రాంగ్ టైమ్ లో రిస్క్ చేస్తున్న చిన్న హీరో

అసలు మనిషి మొహాన్నే గుర్తుపట్టలేని వాడు అక్రమంగా 3 మర్డర్ కేసుల్లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? ప్రసన్నవదనం సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టూనే సాగుతుంది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా జానర్, స్టోరీలైన్ ను దాచే ప్రయత్నం చేయలేదు మేకర్స్.

సినిమా స్టోరీ ఏంటి.. హీరో క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని చెబుతూనే, సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ట్రయిలర్ కట్ చేశారు. తాజాగా రిలీజైన ట్రయిలర్ లో చాలా విషయాలు చెప్పేశారు. కానీ తెరపై చూడాల్సింది ఇంకా చాలా ఉందనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పారు.

ఫేస్ బ్లైండ్ నెస్ ఉన్న హీరో. అద్దంలో తన ముఖాన్ని తానే గుర్తుపట్టలేదు. చేతిపై ఉన్న టాటూలో పేరు చూసి ముఖం గుర్తుపట్టినట్టు నటిస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి 3 మర్డర్ కేసుల్లో ఇరుక్కుంటాడు. అర్జున్ వైకే డైరక్ట్ చేసిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాను మణికంఠ నిర్మించాడు. విజయ్ బుల్గానిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గ మూడ్ ను సెట్ చేసింది.

అంతా బాగానే ఉంది కానీ, ఈ టైమ్ లో ఈ సినిమా థియేటర్లలో ఆడుతుందా అనే బేసిక్ డౌట్ మాత్రం చాలామందిలో ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఎన్నికల వేడి కూడా ఊపందుకుంది. ఇలాంటి టైమ్ లో వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతోంది ఈ సినిమా.

గట్టిగా పాజిటివ్ టాక్ వస్తే తప్ప, ప్రేక్షకుడు థియేటర్ల వైపు చూడడు. ప్రసన్నవదనంతో అలాంటి టాక్ కచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

Show comments

Related Stories :