రేటు పెంచి బుక్కయిన హీరో

సక్సెస్ వచ్చినప్పుడు పారితోషికం పెంచడం కామన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో వరకు అంతా చేసే పనే ఇది. సక్సెస్ వచ్చిన తర్వాత ఓ హీరో వంద కోట్లు తీసుకుంటున్నాడు. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కాల్షీట్ కు 5 లక్షలు తీసుకుంటున్నాడు.

అయితే అందరికీ ఇది వర్తించదు. ఈ విషయం తెలియక ఓ నటుడు బొక్కబోర్తా పడ్డాడు. సినిమాల్లేక, చేసిన సినిమాలు రిలీజ్ అవ్వక ఇబ్బంది పడుతున్నాడు.

తెలుగుతెరపైకి తారాజువ్వలా దూసుకొచ్చాడు ఆ నటుడు. విదేశాల్లో ఉద్యోగం వదిలేసి మరీ హీరో అవుదామని పరిశ్రమకొచ్చాడు. ఓ పెద్ద సినిమాలో విలన్ గా కూడా చేశాడు. తన కంఠంతో ఎంతోమందిని ఆకర్షించాడు. కరోనా టైమ్ లో కింగ్ అనిపించుకున్నాడు.

అయితే అదే అతడి కొంప ముంచింది. అప్పట్లో థియేటర్లలో ఓ సినిమా క్లిక్ అయింది. ఓటీటీలో 2 సినిమాలు బాగానే ఆడాయి. దీంతో పారితోషికాన్ని అమాంతం పెంచాడు. 2 సినిమాలకు లాభాల్లో వాటా కోరుతూ సహ-నిర్మాతగా కూడా మారాడు.

సరిగ్గా ఇక్కడే పరిస్థితి తలకిందులైంది. రిలీజైన సినిమాలు ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి. ఆల్రెడీ షూటింగ్ అయిన సినిమాలు రిలీజ్ అవ్వని పరిస్థితి. అటు కొత్త దర్శకులు, నిర్మాతలు ఇతగాడి పారితోషికం విని అట్నుంచే అటే జంప్ అవుతున్నారు.

ఏమాటకామాట టైర్-సి హీరోల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సుహాస్ రేసులో ముందున్నాడు. ఈ హీరో స్థానాన్ని దాదాపు ఆక్రమించేశాడు. ఇకపై ఈ హీరో రేటు తగ్గించినా సినిమాలు కష్టమేమో అన్నట్టు తయారైంది పరిస్థితి. 

Show comments

Related Stories :