పరదా మాటున పరమేశ్వరన్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరో ఛాలెంజ్ తీసుకుంది. టిల్లూ స్క్వేర్ లో అల్ట్రా గ్లామరస్ లుక్ లో, బోల్డ్ సీన్స్ తో రెచ్చిపోయిన ఈ బ్యూటీ, ఇప్పుడు మేకప్ లేకుండా నటిస్తోంది. ఆ సినిమా పేరు పరదా.

'సినిమా బండి'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రవీణ్ కాండ్రేగుల, తన రెండో ప్రయత్నంగా అనుపర పరమేశ్వరన్ తో ఈ పరదాను తెరకెక్కిస్తున్నాడు. ఓ సీరియస్ సబ్జెక్ట్ ను అందరికీ కనెక్ట్ అయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

మూవీకి సంబందించి టైటిల్ తో పాటు, అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియోలో దేవత విగ్రహాన్ని వస్త్రంతో కప్పినట్టు చూపించారు. ఆ తర్వాత మహిళా సమూహాన్ని చూపిస్తారు. వాళ్లంతా తమ ముఖాల్ని కవర్ చేసుకుంటారు. అనుపమ పరమేశ్వరన్ మాత్రం క్రమంగా తన ముఖంపై ముసుగును తొలిగించే సన్నివేశాల్ని కాన్సెప్ట్ వీడియోగా విడుదల చేశారు.

ఈ సినిమాలో అనుపమ చాలాచోట్ల మేకప్ లేకుండా కనిపించబోతోంది. అనుపమ డీ-గ్లామరస్ గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆమె మేకప్ లేకుండా నటించింది. పరదాలో మాత్రం ఆమె ఎక్కువగా డీ-గ్లామరస్ గానే కనిపించబోతోంది.

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లోని గ్రామాల్లో ఈ సినిమాను షూట్ చేశారు. వచ్చే నెలలో హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Show comments

Related Stories :