మెగా హీరోలు ఎందుకు దూరం?

పవన్ పార్టీ జనసేన ప్రచారానికి జబర్దస్త్ నటుడు ఆది, డ్యాన్స్ మాస్టర్ జానీ లాంటి వాళ్లు రంగంలోకి దిగారు. నిర్మాత బన్నీ వాస్ సరేసరి. కానీ మెగా హీరోలు మాత్రం ఎంటర్ కావడం లేదు. ఎందుకనో?

వరుణ్ తేజ్ వున్నారు. జనసేన కీలకనేత నాగబాబు కుమారుడు. అలాగే మిగిలిన మెగా హీరోలు వున్నారు. కానీ రంగంలోకి దిగడం లేదు. లేదా పవన్ వారిని దిగనివ్వడం లేదు అనుకోవాలేమో? మరి ఆది మాత్రం రంగంలోకి దిగాలన్న మాట. మెగా ఫ్యాన్స్ మద్దతు కు సంబంధించి ఆ సంఘ నాయకుడు స్వామి నాయుడు పిలుపునిచ్చారు.

ఫస్ట్ వీక్ లో పిఠాపురం ప్రచారానికి మెగాస్టార్ చిరు వస్తారనే టాక్ వుంది. మరి మెగా హీరోలు ఎందుకు రావడం లేదు..రానివ్వడం లేదు? నిజానికి జబర్దస్త్ ఆది కన్నా వారికి బెటర్ ఫాలోయింగ్ వుంటుంది..వుంది కదా. వారు కనుక జనసేన నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఫలితం కనిపిస్తుంది కూడా. కానీ ఎందుకని వారిని రాజకీయాలకు దూరం పెడుతున్నారు. వారికి కెరీర్ ముఖ్యం అనా? మరి వారికి కెరీర్ ముఖ్యం అనుకుంటే పృథ్వీరాజ్, ఆది లాంటి వాళ్లకు అవసరం లేదా?

మొత్తం మీద చూస్తుంటే పవన్ కావాలనే తన కుటుంబీకులను చాలా తెలివిగా దూరంగా వుంచుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆది, జానీ, బన్నీ వాస్ లాంటి వాళ్లను మాత్రం వాడేస్తున్నారు.

Show comments

Related Stories :