డబుల్ ఇస్మార్ట్.. ఏం జరుగుతోంది?

పూరి జగన్నాధ్ సినిమా అంటే ఎట్లుండాలి.. అనౌన్స్ చేసామా.. ఇలా షూటింగ్ చేసామా.. అలా విడుదల చేసేసామా అన్నట్లుండాలి. కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా మాత్రం అలా లేదు. ఒక అడుగు ముందు వేయడం, మూడు అడుగులు వెనక్కు వెయడం అన్నట్లు సాగుతోంది. షూటింగ్ అంతా అయిపోయింది. కొద్దిగా టాకీ, రెండు, మూడు పాటలు బకాయి అంటారు. కానీ అవి మాత్రం ఫినిష్ చేయరు.

ఇప్పటికే రెండు మూడు సార్లు షూటింగ్ షెడ్యూలు చేసి, వాయిదా వేసారు. ఆ మధ్య కొంత వరకు ఫైనాన్సియల్ సమస్యలు అని వార్తలు వినిపించాయి. అయితే ఓ ప్రముఖ ఫైనాన్సియర్ 30 కోట్లు అందించడంతో చాలా వరకు పని జరిగింది.

హీరో రామ్ తన రెమ్యూనిరేషన్ అంతా ఇస్తే తప్ప సినిమా ఫినిష్ చేయను అని అన్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు వేరేగా వినిపిస్తోంది. డబ్బింగ్ చెప్పే టైమ్ కు ఇస్తే చాలు అని రామ్ అంటున్నారని, అలా వద్దు, మొత్తం పారితోషికం ఇచ్చాకే బ్యాలన్స్ వర్క్ చేస్తానని పూరి పట్టుదలగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో తీసుకున్న ముఫై కోట్లకు అదనంగా మరో అయిదు కోట్లు ఫైనాన్స్ కోసం పూరి- చార్మి ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తోంది. ఈ లోగా నెట్ ఫ్లిక్స్ కు ప్రాజెక్ట్ ను డీల్ చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వన్స్ ఆ డీల్ ఫైనల్ అయితే ఇక ప్రాజెక్ట్ చకచకా విడుదల దిశగా అడుగు ముందుకు వేస్తుందని తెలుస్తోంది.

హీరో రామ్ చేతిలో ప్రస్తుతం వున్న సినిమా ఇది ఒక్కటే. దీనికి విడుదల డేట్ సెట్ చేయడం కూడా అంత సులువు కాదు. ఎందుకంటే ఫ్యాన్సీ డేట్ లు అన్నీ రిజర్వ్ అయిపోతున్నాయి.

Show comments

Related Stories :