హిట్ కాంబినేషన్ కే దిక్కులేదు

రెండు హిట్ లు కొట్టిన దర్శకుడు. ఆ తరువాత సినిమాకు మెగాస్టార్, సూపర్ స్టార్ లెవెల్ పేర్లు వినిపించాయి. కానీ అక్కడంత సీన్ లేకపోయింది. ఆఖరికి తనకు అచ్చి వచ్చిన హీరోతోనే మరో సినిమా స్టార్ట్ చేసారు. హిట్ కాంబినేషన్ కాబట్టి, ప్రాజెక్ట్ కు క్రేజ్ వస్తుంది అనుకున్నారు. ఓ అడియో సంస్థ నాన్ థియేటర్ రైట్స్ అంతా అగ్రిమెంట్ చేసుకుని, అమ్మడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

కానీ అప్పుడు తెలిసింది. సదరు హీరో నాన్ థియేటర్ మార్కెట్ అంతా బజ్జుంది అని. ఇప్పుడు ఆ సినిమా నాన్ థియేటర్ హక్కులు మార్కెట్ చేయడానికి సదరు అడియో సంస్థ కిందా మీదా పడుతోంది. కానీ పరిస్థితి ఇలా వుంటే మరో పెద్ద నిర్మాత అదే హీరో మీద భారీ బడ్జెట్ పెట్టి, ఫుల్ యాక్షన్ సినిమా తీసేస్తున్నారు.మరి ఏ ధైర్యంతో తీస్తున్నారో? ఏమిటో? అని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన హిట్ లు లేని, వరుస ఫ్లాపులు ఇస్తున్న మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి దారుణంగా వుంది. ఏదో ఒక సినిమా తీసేయాలనో, లేక మొహమాటమో, ఇలాంటి హీరోలతో సినిమాకు నిర్మాతలు ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు కానీ మార్కెట్ చేసుకోలేక కిందా మీదా అవుతున్నారు. 2025 చివరి నాటికి ఇలాంటి మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి ఎలా వుంటుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Show comments

Related Stories :