నిశ్చితార్థం మాత్రమే కాదు, పెళ్లి కూడా సీక్రెట్?

హీరోయిన్ అదితి రావు హైదరి, నటుడు సిద్దార్థ్ ఈమధ్య సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మీడియా దాన్ని సీక్రెట్ అంటోంది. ఈ జంట మాత్రం ఆ నిశ్చితార్థాన్ని 'ప్రైవేట్' అంటోంది. ఈ సంగతి పక్కపపెడితే.. గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, పెళ్లిని కూడా అంతే గుంభనంగా ముగించాలని భావిస్తున్నట్టుంది.

ప్రస్తుతం అదితిరావు వ్యవహార శైలి చూస్తుంటే, ఆమె పెళ్లి కోసం ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఎక్కువగా మేకప్ స్టుడియోల చుట్టూ తిరుగుతోంది. ముంబయిలోనే సమయం దొరికినప్పుడల్లా షాపింగ్ చేస్తోంది. కొంతమంది డిజైనర్లతో చర్చలు సాగిస్తోంది.

ఇవన్నీ పెళ్లి కోసమే అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డేట్ ఫిక్స్ అయిన తర్వాతే కదా, ఎవరైనా ఇలాంటి పనులు పెట్టుకుంటారు. సో.. అదితి రావు, సిద్దార్థల పెళ్లి తేదీ ఫిక్స్ అయిందన్నమాట. అది ఎప్పుడు, ఎక్కడ అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

మహాసముద్రం సినిమాతో అదితిరావు-సిద్దార్థ్ కలిశారు. అప్పట్నుంచి రెగ్యులర్ గా ఇద్దరూ టచ్ లోనే ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

Show comments

Related Stories :