చంద్రబాబు ఆస్తి విలువ రూ.931 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆస్తులు 39 శాతం పెరిగాయి. తనకు, తన భార్యకు కలిపి 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో బాబు స్పష్టం చేశారు.

ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే, ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఆస్తుల విలువ 39 శాతం పెరిగింది. ఈ ఆస్తుల్లో 668 కోట్లు నారా భువనేశ్వరి పేరిట ఉన్నాయి. ఇవన్నీ హెరిటేజ్ ఫుడ్స్, నిర్వాణ హోల్డింగ్స్ లాంటి సంస్థల్లో భువనేశ్వరి పెట్టుబడులుగా ఉన్నాయి.

వీటితో పాటు భువనేశ్వరి వద్ద 3 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉన్నాయి. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే, భువనేశ్వరికి హైదరాబాద్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు, పొలాలు ఉన్నాయి. ఇక మిగిలిన కొద్దిపాటి మొత్తాన్ని చంద్రబాబు పేరిట చూపించారు.

కేసుల విషయానికొస్తే, చంద్రబాబుపై 24 క్రిమినల్ కేసులున్నాయి. వీటిలో కీలకమైన అమరావతి రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కామ్ తో పాటు.. ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్ మెంట్ కేసులున్నాయి. భర్త చంద్రబాబు తరఫున భువనేశ్వరి ఈరోజు నామినేషన్ పేపర్లు అందించారు. అందులో తన, తన భర్త ఆస్తుల్ని ఆమె వెల్లడించారు. Readmore!

బాలయ్యకు రూ. 9 కోట్లు అప్పు

అటు బాలకృష్ణ ఆస్తులు-అప్పుల వివరాలు కూడా కూడా బయటకొచ్చాయి. తన నామినేషన్ పత్రాల్లో ఆస్తులు-అప్పుల వివరాల్ని బాలకృష్ణ వెల్లడించారు. బాలకృష్ణ ఆస్తుల విలువ 81.63 కోట్లు. తనకు 9 కోట్ల 9 లక్షల 22వేల రూపాయల అప్పుు ఉన్నట్టు బాలయ్య ప్రకటించుకున్నారు. ఇక ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ అక్షరాలా 140 కోట్ల 38 లక్షలు. ఆమెకు దాదాపు 3 కోట్ల 83 లక్షల రూపాయల అప్పులున్నాయట.

Show comments