సమ్మర్ అంతా ఎన్నికల పాలు

ఇప్పుడు మళ్లీ థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అసలు వేయడానికి సినిమాలే లేవు. థియేటర్ల వ్యాపారంలో వున్నవారు రెండు మూడు కోట్లకు ఏదో ఒక చిన్న సినిమా కొని, తమ థియేటర్లకు ఫీడింగ్ ఇచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ రేంజ్ సినిమాలు కూడా కనిపించడం లేపు.

నిజానికి సమ్మర్ అంటే సినిమాలకు పీక్ సీజన్. కానీ ఎన్నికల పుణ్యమా అని ఏప్రిల్, మే నెలలు రెండూ దాదాపు కరిగిపోతున్నాయి. ఎన్నికలు పూర్తి కాగానే ప్రభాస్ కల్కి సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే సూచనలు కనిపించడం లేదు. అంటే సమ్మర్ లో కీలకమైన మే నెల గడచిపోతుంది.

జూన్ నెలలో వస్తే కనుక కొంత వరకు సమ్మర్ వుంటుంది. జూలై కి వెళ్తే సమ్మర్ పూర్తిగా వృధాగా పోతుంది. పోనీ అలా అని మే, జూన్ నెలల్లో మంచి మిడ్ రేంజ్ సినిమాలు ఏమైనా వున్నాయా అంటే క్రేజీ కాంబినేషన్ వున్న సినిమా ఒక్కటీ లేదు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు వున్నాయి కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి గట్టిగా మూడు నాలుగు కోట్ల బిజినెస్ చేసేవి లేవు.

మొత్తం మీద చూస్తుంటే ఈ ఏడాది కల్కి, పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్ సినిమాలు కనిపిస్తున్నాయి. బాలయ్య- బాబీ సినిమా, ధనుష్- శేఖర్ కమ్ముల సినిమాలు కూడా క్రేజీ కాంబినేషన్లే. అవి ఎప్పుడు వస్తాయో ఇంకా క్లారిటీ లేదు. చైతన్య థండేల్, నిఖిల్ రాబిన్ హుడ్ డిసెంబర్ కు వెళ్లిపోయాయి. అంటే ఏడు నెలలు నాలుగు పెద్ద సినిమాలు, నాలుగు మిడ్ రేంజ్ సినిమాలు, ఆపై చిన్న సినిమాలు వుంటాయన్న మాట.

పవన్ ఓజి కి డేట్ ఇచ్చారు కానీ, అదంతా రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి వుంటుంది.

Show comments

Related Stories :