సూపర్ స్టార్ ఇంటికి సీఎం.. పూర్తి సంఘీభావం

బాలీవుడ్ సూపర్ స్టార్, సల్మాన్ ఖాన్ ఇంటికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెళ్లారు. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో సల్మాన్ ను కలిసిన షిండే.. సల్మాన్ ఖాన్ తండ్రి, సీనియర్ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ ను కూడా పరామర్శించారు.

ఈ సందర్భంగా సల్మాన్ కు పూర్తి సంఘీభావం తెలిపారు సీఎం. సల్మాన్ కు, అతడి కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి భద్రతను ఇప్పటికే పెంచామని తెలిపారు. తనను పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రికి సల్మాన్ కృతజ్ఞతలు తెలిపాడు.

సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపింది తామేనని వాళ్లు అంగీకరించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో తమకు సంబంధాలున్నాయని, తుపాకులు కూడా అతడి గ్యాంగే ఇచ్చిందని వెల్లడించారు. కోర్టు వీళ్లుక 10 రోజుల కస్టడీ విధించింది.

బాంద్రాలో సల్మాన్ నివశిస్తున్న గెలాక్సీ అపార్ట్ మెంట్ బయట వీళ్లు కాల్పులు జరిపారు. నేరుగా సల్మాన్ ఇంటిపైకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ తుపాకీని సూరత్ లోని నదిలో పడేశారు. కేవలం డబ్బుల కోసమే ఈ పని చేసినట్టు వాళ్లు అంగీకరించారు.

నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే, సల్మాన్ ను కలిశారు. కేసు పురోగతిని సల్మాన్ కు వివరిస్తూనే, పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సల్మాన్ కు ఇప్పటికే వై-ప్లస్ కేటగిరీ భద్రత అమల్లో ఉంది. దాన్ని మరోసారి సమీక్షించే అవకాశం ఉంది.

Show comments

Related Stories :