ధనుష్ సినిమాలో సంజ‌య్ దత్?

విధి ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకుంటుందో తెలియదు. ఒకటి రెండేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సంజ‌య్ దత్ మీద అందరికీ ఎంతో జాలి. అయ్యో..అనారోగ్యం పాలయ్యాడు అని. అసలు అప్పటికి చేస్తున్న కేజీఎఫ్ 2 సినిమా పూర్తవుతుందా? కాదా అని అనుమానాలు. 

కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. దక్షిణాదిన బలమైన ప్రతినాయకుని పాత్ర లేదా, కీలకమైన పాత్ర వుంటే సంజ‌య్ దత్ కేసి చూస్తున్నారు.

ప్రభాస్-మారుతి సినిమాలో ఇప్పటికే సంజ‌య్ దత్ వున్నారు. ప్రభాస్ కు తాత పాత్ర అని ఓ టాక్ వుంది. అసలు సంగతి తెలియాల్సి వుంది. ఇటీవల పెద్ద హిట్ అయిన కమల్ హాసన్ సినిమా విక్రమ్ సీక్వెల్ కోసం సంజ‌య్ దత్ ను తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో సినిమా కోసం కూడా సంజ‌య్ దత్ పేరు పరిశీలిస్తున్నారు.

ధనుష్-శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తయారు కాబోయే థ్రిల్లర్ మూవీ కోసం విలన్ పాత్ర కోసం సంజ‌య్ దత్ పేరును పరిశీలిస్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే ముచ్చటగా మూడో సినిమా అవుతుంది సౌత్ లో. ఇవి కాక మరో ఒకటి రెండు సబ్జెక్ట్ ల్లో కూడ సంజ‌య్ వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments