అర్థరహితమైన నిందలతో రెచ్చిపోతున్న లోకేష్!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తమ పాలనలో కక్షసాధింపులు ఉండవని వారు అధికారం చేపట్టగానే చెప్పారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ.. తాము చేయగల కక్ష సాధింపులో ఇంకో రేంజిలో ఉంటాయని నిరూపిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో తమ పార్టీకి కార్యాలయాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకుంది. అక్కడ కార్యాలయాల నిర్మాణాలు చేసుకుంటున్నారు. అయితే అవన్నీ అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు అంటూ ప్రభుత్వం కూల్చివేతలు ప్రారంభించింది.

రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ఆల్రెడీ కూల్చివేశారు. మరోమ 23 జిల్లాల్లో కూల్చివేతలకు నోటీసులు ఇచ్చారు. ఇలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ , జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచితమైన రీతిలో ముడిపెట్టి నిందలు వేస్తున్నారు.

‘జగన్.. ఈ రాష్ట్రం నీతాత జాగీరా? 26 జిల్లాల్లో పార్టీ ఆఫీసులకు భూ కేటాయింపులు చేశారు. 500 కోట్లతో ప్యాలెస్ లు కడుతున్నావు. నామమాత్రపు లీజుతో 42 ఎకరాలు తీసుకున్నారు. ఆ భూములతో 4200 మంది పేదలకు సెంటు ఇంటి స్థలాలు ఇవ్వచ్చు’ అని లోకేష్ అంటున్నారు. Readmore!

పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములను లీజు లేదా కొనుగోలు చేసి తీసుకోవడం జగన్ కనిపెట్టిన కొత్త పద్ధతేమీ కాదు. తెలుగుదేశం కూడా గతంలో అదే పనిచేసింది. అలాంటిది జగన్ ఏదో తప్పు చేసినట్టుగా లోకేష్ మాట్లాడడం చిత్రం. 500 కోట్లతో కట్టుకుంటారో, వెయ్యి కోట్లతో కట్టుకుంటారో.. వారి పార్టీ డబ్బులే పెడుతున్నారు తప్ప.. ప్రభుత్వం కట్టడం లేదు కదా.. దానిని లోకేష్ ఎలా ప్రశ్నించగలరు.. అనేది ఒక ప్రశ్న. అలాగే.. పార్టీ కోసం కార్యాలయాలు కడుతోంటే.. జగన్ కు ప్యాలెస్ ల పిచ్చి అని లోకేష్ వ్యాఖ్యానించడం కూడా సబబుబగా లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అయినా 42 ఎకరాల్లో 4200 సెంటు ఇళ్ళస్థలాలు ఎలా ఇస్తారు? రోడ్లు కామన్ ఏరియాలు ఏమీ ఉండవా.. అని లోకేష్ చేస్తున్న అర్థం లేని నిందలను చూసి జనం నవ్వుకుంటున్నారు. లోకేష్ అధికారంలో ఉన్న నాయకుడు గనుక.. ఆయన కాస్త బాధ్యతగా మాట్లాడాలని కూడా అంటున్నారు.

Show comments