మరో బ్రేకప్.. అవును, వాళ్లిద్దరూ విడిపోయారు

హీరోయిన్ శృతిహాసన్ కు ప్రేమలు-బ్రేకప్స్ కొత్త కాదు. మినిమం గ్యాప్ లో ఆమె ప్రేమలో పడుతుంది, ఆ వెంటనే బ్రేకప్ కూడా అవుతుంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి బ్రేకప్ దశలో ఉన్నట్టు కనిపిస్తోంది.

కొన్నాళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో డేటింగ్ చేస్తోంది శృతిహాసన్. ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో శాంతనూతో దిగిన ఫొటోలు, వీడియోలు పెడుతూనే ఉంది.

ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కరోనా టైమ్ కు ముందునుంచే వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. కరోనా టైమ్ లో ఇద్దరూ ఒకే ఫ్లాట్ కు షిఫ్ట్ అయ్యారు. అది శృతిహాసన్ సొంత ఫ్లాట్. అప్పట్నుంచి లివ్-ఇన్ లోనే ఉన్నారు. ఇప్పుడు విడిపోయినట్టు వార్తలొస్తున్నాయి.

శృతిహాసన్, శాంతను సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్-ఫాలో చేసుకున్నారు. అంతకంటే ముందు పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టింది శృతిహాసన్. "ఇది చాలా క్రేజీ రైడ్. ఈ జర్నీలో నా గురించి, కొంతమంది మనుషుల గురించి చాలా నేర్చుకున్నాను." అంటూ పోస్ట్ పెట్టింది.

వీళ్లిద్దరూ విడిపోయరంటూ పుకార్లు రావడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. తను ఏ కార్యక్రమానికి వెళ్లినా శాంతనూను కూడా తీసుకెళ్తుంది శృతిహాసన్. కానీ ఈమధ్య తను సింగిల్ గానే వెళ్తోంది. దీనికితోడు తన సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి శాంతనుకు సంబంధించిన చాలా ఫొటోలు, వీడియోల్ని ఈమె డిలీట్ చేసినట్టుంది.

నిజానికి శృతిహాసన్ కు బ్రేకప్స్ కొత్త కాదు. గతంలో ఆమె సిద్దార్థ్ తో డేట్ చేసింది. అది ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత లండన్ కు చెందిన ఓ నటుడితో కూడా ఆమె డేటింగ్ చేసింది. అది కూడా ఎక్కువ రోజులు సాగలేదు. ఆ తర్వాతే శాంతనూకు కనెక్ట్ అయింది. నాలుగేళ్లకే వీళ్ల బంధం కూడా వీగిపోయింది.

ప్రస్తుతం శృతిహాసన్ సింగిల్. వరుస సినిమాలతో బిజీ అవ్వడానికి ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. త్వరలోనే ప్రభాస్ తో కలిసి సలార్-2 సెట్స్ పైకి వెళ్లబోతోంది.

Show comments

Related Stories :