నా విషయంలో చీలిక ఉంది - నారా రోహిత్

పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వర్గం అతడి సినిమాల్ని వ్యతిరేకిస్తుంది. ఆ స్థాయిలో కాకపోయినా నారా రోహిత్ పట్ల కూడా అలాంటి వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని అతడు కూడా అంగీకరిస్తున్నాడు.

"ప్లస్-మైనస్ రెండూ ఉన్నాయి. నా ఇంటి పేరు కారణంగా ప్రేక్షకుల్లో చీలిక కచ్చితంగా ఉంటుంది. కాకపోతే ప్రతినిధి-2 అనేది సరైన సీజన్ లో వస్తోంది కాబట్టి ఆ సమస్య ఉండదనుకుంటున్నాను. చలికాలం ఏసీలు ఎవ్వరూ అమ్మరు కదా. సో.. మా సినిమాకు ఇది సరైన టైమ్. ప్రేక్షకుల్లో చీలికతో సంబంధం లేకుండా మైలేజీ ఉంటుందని భావిస్తున్నాను."

ఎన్నికల సీజన్ లో వస్తున్న పొలిటికల్ మూవీ కాబట్టి తమ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉందంటున్నాడు నారా రోహిత్. అయితే నిజజీవితంలో మాత్రం తను రాజకీయాలకు దూరం అంటున్నాడు ఈ హీరో.

"ప్రస్తుతానికి నేను నేరుగా రాజకీయాల్లో లేను. కేవలం మా పార్టీకి ఓ ప్రచారకర్తగా మాత్రమే ఉన్నాను. 2014 నుంచి నేను పార్టీ ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నాను. ఇప్పుడు కూడా వెళ్తున్నాను. ఎవరైనా ప్రత్యేకంగా అడిగినా కూడా వెళ్లి ప్రచారం చేస్తాను. అంతవరకు మాత్రమే. నేరుగా రాజకీయాల్లో నేను చొరవ చూపించను."

తన తాజా చిత్రం ప్రతినిధి-2 ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన సినిమా కాదంటున్నాడు రోహిత్. అన్నట్టు 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామంటున్నారు.

Show comments

Related Stories :