ఇంత నాటకం దీని కోసమా 'డార్లింగ్'

హీరోయిన్ నభా నటేష్, నటుడు ప్రియదర్శి మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ నిన్నంతా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరూ అలా కొట్టుకున్నారేంటంటూ చాలామంది అనుమానం వ్యక్తం చేశారు కూడా. ఆ అనుమానాలే నిజమయ్యాయి. కేవలం తమ సినిమా ప్రచారం కోసమే, వీళ్లు ఇలా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. ఈరోజు ఆ మేటర్ క్లియర్ అయింది.

ప్రియదర్శి, నభా నటేష్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. సైలెంట్ గా సినిమా పూర్తిచేశారు. ఈమధ్య హనుమాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన నిరంజన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. వై దిస్ కొలవెరి అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించారు.

ఈ రెండు పదాలు వచ్చేలా, మొన్న సోషల్ మీడియాలో ప్రియదర్శి, నభా నటేష్ కామెంట్స్ చేసుకున్నారు. అలా జనాల్ని తమవైపు తిప్పుకొని, సినిమా పేరును ప్రకటించారు. ఈ విషయంలో మేకర్స్ అనుకున్నది సాధించారు.

రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆసక్తిరకంగా ఉంది. సెలూన్ లో ప్రియదర్శి, జీవితంలో వివిధ దశల్లో ఆడవాళ్ల మనస్తత్వం గురించి చెప్పడం బాగుంది. ఓవరాల్ గా సినిమా జానర్ ఏంటనేది ఈ గ్లింప్స్ తో చెప్పారు. వివేక్ సాగర్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.

బలగం, మంగళవారం, ఓం భీమ్ బుష్ లాంటి సినిమాలతో మంచి ఊపుమీదున్నాడు ప్రియదర్శి, ఇప్పుడు అదే ఊపులో ఈ డార్లింగ్ ను మన ముందుకు తీసుకొస్తున్నాడు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

Show comments

Related Stories :