నిర్మాతలకు జనసేన మొహమాటం!

నిర్మాతలను హీరోలు చాలా స్మూత్‌గా వాడేస్తారు. అలాంటి వాడకానికి కూడా వాళ్లు అలవాటు పడిపోయారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నారు.

జనసేనకు సంబంధించిన కొన్ని పనులను నిర్మాతలకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. పవన్ తరపున టాలీవుడ్ లో ఓ కీలక వ్యక్తి వాటి వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల పార్టీ ప్రమోషన్ కోసం ఓ వీడియో చేయించారు. దాన్ని పవన్ తో సినిమా చేస్తున్న ఓ భారీ నిర్మాత మీద భారం వేసినట్లు తెలుస్తోంది.

అలాగే 2014 టైమ్‌లో పవన్ కోసం సోషల్ మీడియా వింగ్‌ను నిర్వహించిన ఓ నిర్మాత మీద ఈసారి కొన్ని ప్రకటనల రూపకల్పన భారం వేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో పెద్ద సంస్థ మీద పవన్ కు సంబంధించిన కొన్ని రవాణ ఏర్పాట్ల భారం మోపినట్లు తెలుస్తోంది. సినిమాలు చేస్తున్నారు. చేయాల్సి వుంది. అందువల్ల ఏ నిర్మాత కూడా కాదని అనలేరు.

ఈ పనుల క్వాలిటీ చెక్, కో ఆర్టినేషన్‌ను పవన్ సన్నిహితుడైన ఓ పెద్ద తలకాయ ఇక్కడ తన భుజాల మీద వేసుకున్నట్లు తెలుస్తోంది.

Show comments

Related Stories :