ఇది చైనా సినిమా కాదు.. పక్కా తెలుగు మూవీ

మిరాయ్.. ఇదేదో చైనా సినిమా టైటిల్ లా ఉంది. గ్లింప్స్ లో విజువల్స్, గ్రాఫిక్స్, సెట్, ఫైట్స్ కూడా చైనా సినిమాను తలపించాయి. కానీ మిరాయ్ అనేది చైనీస్ సినిమా కాదు, పక్కా తెలుగు సినిమా. తేజ సజ్జా హీరో.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తేజ సజ్జా హీరోగా సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి గ్లింప్స్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ పెట్టారు. వచ్చే ఏడాది సరిగ్గా ఇదే రోజున మిరాయ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

మిరాయ్ అంటే భవిష్యత్తు అని అర్థం అంట. అశోకుని కాలానికి చెందిన 9 గ్రంథాలను తరతరాలుగా కొందరు యోధులు రక్షిస్తూ ఉంటారు. మనిషిని దైవంగా మార్చే శక్తి ఆ గ్రంథాలకు ఉంటుంది. ఆ గ్రంథాలకు గ్రహణం పుడుతుంది. దాన్ని ఆపడానికి ఓ శక్తి జన్మిస్తుంది.

ఇలా మిరాయ్ స్టోరీలైన్ ను కూడా వెల్లడించారు. హనుమాన్ లో సూపర్ హీరోగా కనిపించిన తేజ సజ్జా, మిరాయ్ లో కూడా అదే పాత్ర పోషించబోతున్నాడనే విషయం గ్లింప్స్ చూస్తే అర్థమౌతోంది.

అంతర్జాతీయ సినిమా స్థాయికి తగ్గట్టు మేకింగ్స్, గ్రాఫిక్స్ ఇందులో చూపిస్తారంట. ఇందులో తేజ సజ్జ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటించబోతోంది. హను-మాన్ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరక్టర్స్ లో ఒకరైన గౌర హరి, ఈ మిరాయ్ కు సంగీతం అందిస్తున్నాడు.

Show comments

Related Stories :