గ్యాప్ లో మరో సినిమా రెడీ చేసిన హీరో

నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ప్రతినిధి-2. ఈ సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే థియేటర్లలోకి కూడా రాబోతోంది. అయితే ఈ గ్యాప్ లో మరో సినిమా కూడా రెడీ చేశాడు ఈ హీరో. దాని పేరు సుందరకాండ.

వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేస్తున్నాడు నారా రోహిత్. కెరీర్ లో ఇతడికిది 20వ చిత్రం. శ్రీరామనవమి సందర్భంగా సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు, గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు నారా రోహిత్. ఇదొక రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ సినిమాతో వృతి హీరోయిన్ గా పరిచయమౌతోంది.

పనిలోపనిగా సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 6న ఈ సినిమాకు థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. నరేష్, వాసుకి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు లియోన్ జేక్స్ సంగీతం అందించాడు. అన్నట్టు నారా రోహిత్ ఏం తగ్గలేదు. అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నాడు.

Show comments

Related Stories :