దుబాయ్ లో 'తగ్గేదేలే'

మరో 10 రోజుల్లో పుట్టినరోజు జరుపుకోబోతున్న అల్లు అర్జున్ కు అద్భుతమైన బహుమతి లభించించి. అతడి మైనపు విగ్రహాన్ని దుబాయ్ లో ఆవిష్కరించారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన ఈ మైనపు విగ్రహంలో స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు బన్నీ. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన తగ్గేదేలే మేనరిజమ్ తో ఈ విగ్రహాన్ని రూపొందించారు.

ఈ విగ్రహం కోసం చాన్నాళ్ల కిందటే బన్నీని సంప్రదించింది మేడమ్ టుస్సాడ్స్ సిబ్బంది. బన్నీ కొలతలతో పాటు, అతడి కనుగుడ్లు రకం, హెయిర్ శాంపిల్స్ ను తీసుకున్నారు. అలా అచ్చం బన్నీని పోలిన మైనపు విగ్రహాన్ని తయారుచేశారు.

ఈ విగ్రహాన్ని స్వయంగా బన్నీ ఆవిష్కరించాడు. దీనికోసం కుటుంబంతో కలిసి కొన్ని రోజుల కిందటే దుబాయ్ వెళ్లాడు. విగ్రహాన్ని తన చేతులతో ఆవిష్కరించడంతో పాటు, కుటుంబంతో కలిసి సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం పుష్ప-2 సినిమా చేస్తున్నాడు బన్నీ. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. బన్నీ బర్త్ డేకు సినిమా నుంచి ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ఈ హీరో తదుపరి మూవీ వివరాలు కూడా పుట్టినరోజు సందర్భంగా బయటకు రాబోతున్నాయి.

Show comments

Related Stories :