బాలకృష్ణ టైటిల్ తో శర్వానంద్ సినిమా?

ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. ఓవైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూనే, మరోవైపు అనీల్ సుంకర నిర్మాతగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చాడు.

ఇప్పుడీ సినిమాకు టైటిల్ దాదాపు లాక్ అయింది. శర్వానంద్, రామ్ అబ్బరాజు సినిమాకు నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ అనుకుంటున్నారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తన సినిమాలకు తెలుగుదనం ఉట్టిపడే టైటిల్స్ పెడుతుంటాడు రామ్ అబ్బరాజు. తన గత చిత్రానికి సామజవరగమన అనే టైటిల్ పెట్టాడు. ఈసారి నారీనారీ నడుమ మురారి అనే టైటిల్ పెట్టే ప్లాన్ లో ఉన్నాడు.

టైటిల్ కు తగ్గట్టు ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఒక హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్టున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ నడుస్తోంది. ఏప్రిల్ 10వరకు ఇది కొనసాగుతుంది. మే నెలలో రెండో షెడ్యూల్ ఉంటుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Show comments

Related Stories :