రెడ్ బుక్ రాజ్యాంగం

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని విన్నాం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమిటి అంటే దీనికి జవాబు వైసీపీ నేతలే చెబుతారు. మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే రెడ్ బుక్ తెరచుకుందని ఆయన ఫైర్ అయ్యారు.

ఫలితాలు వచ్చీ రావడంతోనే టీడీపీ దమనకాండ ఏపీలో మొదలైంది అని ఆయన విమర్శించారు. ఏపీలో వైసీపీ నేతల మీద వరసబెట్టి దాడులు చేస్తున్నారని, అదే ఆవేశంతో ప్రభుత్వం ప్రైవేట్ అన్నది చూడకుండా అన్ని ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు అని గుడివాడ విరుచుకుపడ్డారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ని టార్గెట్ చేసిందని అన్నారు. దాంతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులోకి వచ్చిందని  అంతా భావించే పరిస్థితి ఉందని అన్నారు. వైసీపీ కార్యాలయాలను కూలగొట్టడం అందులో భాగమే అన్నారు.  తాము నిబంధనలు అన్నీ అనుసరించి నిర్మాణాలు చేస్తూంటే దానిని కాదని కూల్చివేతలకు దిగడం ఏ రకమైన విధ్వంశంగా చూడాలని గుడివాడ ప్రశ్నించారు.

ప్రజలకు మేలు చేయడం సంగతి పక్కన పెట్టి వైసీపీని వేధించేందుకు అధికారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని ఆయన అన్నారు. ప్రజలు ఈ విషయాలు అన్నీ గమనిస్తున్నారు అని ఆయన హెచ్చరించారు. వైసీపీ ఆఫీసులను కూల్చుతున్న అధికారులు ముందు టీడీపీ మంగళగిరిలో కట్టిన ఆఫీసుని చూడాలని కోరారు. వాగులో ఆఫీసుని నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఆయన ఆరోపించారు. Readmore!

ఆనాడు వైసీపీ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అని టీడీపీ నేతలు ఆరోపించేవారు. ఇపుడు వైసీపీ నేతలు రివర్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. అసలు రాజ్యాంగాన్ని గౌరవించి పాలన చేసేది ఎపుడు అన్నది సగటు మనిషి ప్రశ్నగా ఉంది.

Show comments