అధ్యక్షా.. మిస్ అయింది అధ్యక్షా?

శాసన సభలో ప్రసంగాలు అంటే ముందుగా గుర్తు వచ్చేది అధ్యక్షా. ఉపన్యాసం ప్రారంభించి చివరి వరకు వీలయినన్ని సార్లు వినిపించే పదం అధ్యక్షా. తొలిసారి సభలో మాట్లాడిన మంత్రి పవన్ కళ్యాణ్ స్పీచ్ లో ఈ చమక్కు మిస్ అయింది. అధ్యక్షా అనకుండానే స్పీచ్ ప్రారంభించారు. ముందుగా రాసి ఇచ్చిన, లేదా రాసుకున్న స్పీచ్ ను చదివారు. అదేమీ తప్పిదం కాదు. స్పీచ్ లో కూడా సుతిమెత్తగా అయినా కొద్ది పాటి ఎత్తి పొడుపులు వినిపించాయి.

అసెంబ్లీలో కానీ బయట కానీ విమర్శలో వినిపించే భాష ఎలా వుండాలో చెప్పారు. వీలయనన్ని మంచి మాటలు చెబుతూనే, వైకాపా జనాలు అసెంబ్లీలో లేకపోవడాన్ని ఎత్తి పొడిచారు. చాలా చొట్ల స్పీకర్ అయ్యన్న ను గురించి చాలా మంది మాటలు చెప్పినా, అధ్యక్షా అన్న పదం మాత్రం వాడలేదు. బహుశా తొలిసారి కనుక తెలియకపోవడమో? లేదా ఇది తన పద్దతి అనే ఆలోచనో కావచ్చు. అయితే ఉపన్యాసంలో ఎక్కడా ఏకవచనం కానీ, తప్పు పదం కానీ పవన్ వాడలేదు.

భావంలో వుండే తీవ్రత భాషలో వుండకూడదు.. భాషతో విద్వేషం రేపకూడదు అనే మంచి మాటలు పవన్ ప్రసంగంలో దొర్లాయి. మొత్తం మీద స్పీచ్ అంతా బాగానే వుంది కానీ, ఒకటి రెండు సార్లు సభాపతి అనడం వినిపించింది తప్ప అధ్యక్షా అని మాత్రం అనలేదు..అలవాటు కావడానికి టైమ్ పడుతుందేమో?

Readmore!
Show comments