దీని భావమేమి బండారూ?

తెలుగుదేశం పార్టీలో వున్న పెద్ద కుటుంబం ఏదీ అంటే… అచ్చంనాయుడు కుటుంబమే. ఎలా అంటే ఆయన ఎమ్మెల్యే, ఆయన అన్న కొడుకు ఎంపీ, అతగాడి సోదరి, బావ కూడా పార్టీలోనే ఇంకా మామగారు కూడా మాజీ మంత్రి. బావమరిది కూడా పార్టీలో యాక్టివ్. లాస్ట్ టైమ్ ఎన్నికల్లో వీళ్లందరికీ అవకాశాలు దొరికాయి కూడా. అందువల్ల చాలా పెద్ద ఫ్యామిలీ రాజకీయంగా.

కానీ ఈసారి మాత్రం కింజరాపు రామ్మోహననాయుడు మామగారు బండారు సత్యనారాయణ మూర్తికి అవకాశం రాలేదు. పెందుర్తి సీటు అలయన్స్ లో భాగంగా జనసేనకు వెళ్లిపోయింది. ఈ సీటు నుంచి తను కానీ తన కొడుకు కానీ పోటీ చేయాలని అనుకన్నారు బండారు. కానీ ఇప్పుడు ఆ ఆశ నెరవేరలేదు.

దీంతో కలవరం చెందిన బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు అప్పలనాయుడు ఓ ట్వీట్ వేసారు. అన్ని గుడ్లు ఒకే బాస్కెట్ లో ఎప్పుడూ పెట్టకూడదు అనే పాత కోట్ ను కోట్ చేసారు. సాధారణంగా షేర్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించి ఈ కోట్ వాడతారు. పెట్టుబడులు ఎప్పుడూ ఒకే కంపెనీలో పెట్టకూడదని, ఓ కంపెనీ షేర్ నష్టపోయినా, మరోటి లాభం ఇస్తుందని దీని అర్థం.

బండారు ఇప్పుడు ఈ కోట్ ఎందుకు పెట్టారు అంటే, అంతా ఒకే పార్టీలో వుండడం వల్ల తమకు అవకాశం మిస్ అయిందని బాధపడుతున్నట్లుంది. అవును. తన బావ, ఆయన చిన్నాన్న, ఆయన సోదరికి అవకాశాలు ఇచ్చిన తరువాత తమకు ఎక్కడి నుంచి వస్తుంది. అలా అని ఇప్పుడు ఎదురుతిరగలేరు. ఎందుకంటే అంతా బంధువులే కదా.

Show comments

Related Stories :