బాలీవుడ్ లో మరో ఛాన్స్.. ఈసారి చావో రేవో..!

సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన హీరోయిన్లందరిదీ ఒక లెక్క. కాజల్ అగర్వాల్ ది ఓ లెక్క. మిగతా హీరోయిన్లంతా ఫ్లాపులు తెచ్చుకొని ఫేడవుట్ అయితే, కాజల్ మాత్రం హిట్స్ కొట్టి మరీ ఫేడవుట్ అయింది. ఇప్పుడు కాజల్ కు హిందీ నుంచి ఇంకో ఛాన్స్ వచ్చింది. మరి ఈసారైనా ఈ అమ్మడు అక్కడ పాతుకుపోతుందా...

అజయ్ దేవగన్ హీరోగా నటించిన సింగం సినిమాతో బాలీవుడ్ లో సక్సెస్ అందుకుంది కాజల్. ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. ఆ మూవీ తర్వాత అక్షయ్ కుమార్ హీరోగా స్పెషల్ ఛబ్బీస్ అనే సినిమా చేసింది. అది కూడా హిట్. ఇలా రెండు సక్సెస్ ల తర్వాత కూడా కాజల్ బాలీవుడ్ కెరీర్ గాడిలో పడలేదు. లాస్ట్ ఇయర్ రణదీప్ హుడాతో చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాజల్ కు బాలీవుడ్ నుంచి మరోసారి పిలుపు అందింది. తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ సినిమాను, రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన కాజల్ నే హిందీ రీమేక్ కు కూడా తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ కు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు సినిమా కూడా హిట్ అయితే, కాజల్ బాలీవుడ్ ఆశలు మళ్లీ చిగురించినట్టే. 

ఈసారి కచ్చితంగా ఆమె బాలీవుడ్ లో క్లిక్కవ్వాలి. ఎందుకంటే, తెలుగులో కాజల్ పరిస్థితి ఏం బాగాలేదు.

Show comments