ఒక్క రిలీజ్ లేదు కానీ చేతిలో 3 సినిమాలు

తెలుగు ప్రేక్షకులు ఈమెను ఇప్పటివరకు వెండితెరపై చూడలేదు. కానీ టాలీవుడ్ లో ఆమె తెగ పాపులర్ అయిపోయింది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే అప్పుడే 3 తెలుగు ఆఫర్లు కొట్టేసింది. ఆ బ్యూటీ పేరు మేఘా ఆకాష్.

ప్రస్తుతం నితిన్ సరసన 'లై' అనే సినిమా చేస్తోంది మేఘా ఆకాష్. ఈ మూవీతో పాటు రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుకుతున్న సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండూ ఇంకా రిలీజ్ కాలేదు. ఇంతలోనే మరో ఆఫర్ దక్కించుకుంది ఈ మలయాళీ బ్యూటీ.

పవన్, త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా ఓ సినిమా లాంచ్ అయిన విషయం తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇందులో కూడా హీరోయిన్ గా మేఘా ఆకాష్ నే సెలక్ట్ చేశారు. అలా ఒక్క రిలీజ్ కూడా లేకుండానే చేతిలో 3 సినిమాలతో బిజీ అయిపోయింది మేఘ.

Show comments