నాని-ధనుష్ ఢీ అంటే ఢీ

మాంచి సినిమాలు అంటే భారీ సినిమాలు అని కాదు. నిజంగా మంచి సినిమాలని అంచనా వున్నవి. అలాంటి రెండు సినిమాలు వచ్చేవారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఢీకొంటున్నాయి. 

అందులో ఒకటి నాని హీరోగా చేస్తున్న మజ్ఞు, రెండవది ధనుష్ హీరోగా నటించిన రైల్. నాని ఇప్పటికే మాంచి ఓపెనింగ్స్ రాబట్టగల హీరోగా ఫిక్స్ అయిపోయాడు. నాని సినిమా అంటే మంచి ఓపెనింగ్స్ వుంటాయి అని ఏ డిస్ట్రిబ్యూటర్ ను, ఎగ్జిబిటర్ ను అడిగినా చెబుతారు. పైగా ఉయ్యాల జంపాల ఫేమ్ డైరక్టర్ విరించి వర్మ చేస్తున్న రెండో సినిమాగా మజ్ఞకు ఇప్పటికే మాంచి పాజిటివ్ బజ్ వుంది. ట్రయిలర్లు, వగైరా ప్రామిసింగ్ గా వున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో ధనుష్ చేస్తున్న ఓ డబ్బింగ్ సినిమాను అంత కేర్ చేయక్కరలేదు నిజానికి. కానీ ధనుష్ అంటే బి సి సెంటర్లలో కూడా ఓ అంచనా వుంది. పైగా రైల్ సినిమా అంటే ఇప్పటికే అర్బన్ ఆడియన్స్ లో ఓ అంచనా ఏర్పడింది. దానికి కారణం,  నెట్ లో, చాలా కాలం క్రితమే విడుదలైన రైల్ తమిళ సినిమా ట్రయిలర్. ధనుష్ కూడా మన నాని మాదిరిగా వైవిధ్యమైన సినిమాల్లోనే నటిస్తాడన్న సంగతి తెలిసిందే. రైల్ సినిమాలో మన టాలీవుడ్ జనాల మనసులు దోచిన కీర్తి సురేష్ హీరోయిన్. ఈ సినిమా ట్రయిలర్ చాలా ప్రామిసింగ్ గా, వర్త్ వాచ్ గా కనిపిస్తోంది

సో, ఈ విధంగా రెండు సినిమాలు దాదాపు ఒకేలాంటి వైవిధ్యతను ఇష్టపడే ఇద్దరు హీరోలవి, ఒకే వారం విడుదలవుతున్నాయి. టాలీవుడ్ జనాలకు పండగే మరి. Readmore!

Show comments

Related Stories :