తమన్న ఇంట పెళ్లిసందడి.. మురిసిపోతున్న మిల్కీబ్యూటీ

చేతి నిండా మెహందీ. సంప్రదాయ వంటకాలు. ట్రెడిషనల్ దుస్తులు, మెడనిండా నగలు.. అచ్చం పెళ్లి కూతురిలా ముస్తాబైంది తమన్న. మిల్కీ బ్యూటీ ఇంట్లో పెళ్లి సందడి షురూ అయింది. అయితే పెళ్లి తమన్నాకు కాదు. తమన్న సోదరుడు ఆనంద్ భాటియా పెళ్లి హడావుడి ఇదంతా.

అమెరికాలో డాక్టర్ గా పనిచేస్తున్న ఆనంద్ భాటియా పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది తమన్న కుటుంబం. ఈ పెళ్లి కోసమే ప్రస్తుతం చేస్తున్న కునాల్ కోహ్లీ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చింది. పెళ్లి తంతును ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి షూటింగ్ లో జాయిన్ అవుతుంది.

ఇప్పటికే మెహందీ ఫంక్షన్ పూర్తయింది. సంగీత్ కూడా ముగిసింది. వీటికి సంబంధించిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది తమన్న. సందడంతా నాదే.. ఆనందం మొత్తం నాదే అంటూ ట్వీట్స్ కూడా చేస్తోంది. సోదరుడి పెళ్లికే ఇంతలా ఆనందపడుతున్న తమన్న.. ఇక తన పెళ్లికి ఇంకెంత హంగామా చేస్తుందో చూడాలి.

Show comments