ఒక రోజు తేడాతో బాబాయ్-అబ్బాయ్ హంగామా

అనుకోని విధంగా అటు బాబాయ్, ఇటు అబ్బాయ్ ఇద్దరూ ఒక రోజు తేడాలో సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. రెండూ ప్రతిష్టాత్మక సినిమాలే. రెండూ హై-బజ్ క్రియేట్ చేస్తున్న సినిమాలే. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, ఎట్టకేలకు బాబి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు. ఈరోజు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చాడు తారక్. అటు బాలకృష్ణ కూడా రేపట్నించి తన కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. సెంచరీ మూవీ తర్వాత అటుఇటుగా 2 నెలలు గ్యాప్ తీసుకున్న బాలయ్య, రేపట్నుంచి పూరిజగన్నాధ్ దర్శకత్వంలో సెట్స్ పైకి రాబోతున్నాడు. 

ఎన్టీఆర్, బాలయ్య సినిమాలు రెండూ సంథింగ్ స్పెషల్ ఎలిమెంట్స్ తో ముస్తాబవుతున్నాయి. బాబి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో 3 గెటప్స్ లో కనిపించనున్నాడట తారక్. ఎన్టీఆర్ సెట్స్ పైకి వచ్చిన సందర్భంగా విడుదల చేసిన ఫొటోలో దర్శకుడు బాబి కనిపిస్తున్నాడు. పక్కనే ఉన్న మానిటర్ లో కనిపిస్తున్న వ్యక్తి ఎన్టీఆర్ అయి ఉంటాడని భావిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఈమధ్యే ఎన్టీఆర్ పై ఫొటోషూట్ నిర్వహించిన బాబి, ఓ లుక్ ఫిక్స్ చేశాడు. 

ఇక బాలయ్య కూడా పూరిజగన్నాధ్ సినిమాలో సంథింగ్ డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట. గెటప్ పరంగా ప్రయోగాలేమీ చేయనప్పటికీ... మేనరిజమ్స్ పరంగా బాకృష్ణను కొత్తగా చూపించబోతున్నాడట పూరి, బాలకృష్ణ స్టయిల్ కు తగ్గట్టు ఇప్పటికే తను రాసుకున్న డైలాగ్స్ లో కొన్ని మార్పుచేర్పులు కూడా చేశాడట.  రేపటి షూటింగ్ ను ఫైట్స్ తో స్టార్ట్ చేయబోతున్నారు.

Readmore!
Show comments

Related Stories :