ట్యాగ్ లైన్ టైటిల్ గా మారిన వేళ...

కొన్ని సినిమాలకు టైటిల్స్ మార్చడం మామూలే. ముందు ఓ టైటిల్ అనుకొని... పంచ్ మిస్ అయిందనో, మాస్ అప్పీల్ లేదనే కారణంతోనో మరో టైటిల్ ను ఫిక్స్ చేస్తుంటారు. కానీ ట్యాగ్ లైన్ టైటిల్ గా మారడం మాత్రం సంథింగ్ స్పెషల్. అవసరాల శ్రీనివాస్ కొత్త సినిమా విషయంలో ఇదే జరిగింది. హిందీలో ఎరోటిక్ మూవీగా పేరుతెచ్చుకున్న హంటర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ హీరో. ఈ మూవీకి గతంలో సోగ్గాడే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాబు బాగా బిజీ అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా పెట్టేశారు. 

ఇప్పుడీ టాగ్ లైనే టైటిల్ గా మారిపోయింది. సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో బాబు బాగా బిజీ అనే టైటిల్ ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. అలా సోగ్గాడే అనే టైటిల్ పక్కకు వెళ్లిపోయింది. ఈ రీమేక్ తో నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే డైరక్టర్ గా ఇప్పటికే 2 హిట్స్ కొట్టిన అవసరాల, హంటర్ రీమేక్ లో కూడా దర్శకుడిగా తనదైన ముద్ర చూపించాడని టాక్. 

షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను వచ్చేనెల 13న విడుదల చేయబోతున్నారు. సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చేందుకు పనిలోపనిగా కొన్ని రొమాంటిక్ ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు.

Show comments