స్వంత నియోజకవర్గంలో శల్యసారథ్యం!

మాజీమంత్రి, ప్రస్తుత పమ్మెల్సీ సుభాష్‌చంద్రబోస్‌ శల్యసారథ్యంలో స్వంత నియోజకవర్గం రామచంద్రపురంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా బలహీనపడుతోంది. అందుకు తాజా ఉదాహరణగా రామచంద్రపురం పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలను భావించవచ్చని సాక్షాత్తూ వ్యాఖ్యానిస్తుండటం విశేషం! రామచంద్రపురం మున్సిపాలిటీలో 17,21,23 వార్డులకు ఏప్రిల్‌ 9న ఉపఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెల్లయ్యేసరికి వైకాపా కార్యకర్తలు కంగుతిన్నారు. బోసు స్వంత సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఓట్లు ఉన్న 25వ వార్డుతో పాటు మొత్తం 3వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు పరాజయం పాలుకావడం వారికి అవమానకంగా మారింది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్ధులు విజయం సాధించడం చర్చనీయాంశమయ్యింది. ఇది చాలా అవమానకరంగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 

బోసు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న 25వ వార్డులో తెలుగుదేశం అభ్యర్ధికి భారీ మెజారిటీ లభించింది. స్థానిక నాయకత్వం ప్రజల్లో పట్టుకోల్పోవడం వలనే ఇలా జరిగిందని పలువురు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక 21వ వార్డులో విద్యావంతులు, ధనిక, మధ్యతరగతి వర్గాల వారు అధికంగా ఉన్నారు. ఈ వార్డు కూడా తెలుగుదేశం కైవశమయ్యింది. 17వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపాలిటీ ఛైర్మన్‌ అభ్యర్ధి పోటీ చేసి విజయం సాధించారు. ఇదిలావుంటే ఈ ఎన్నికల్లో మూడు స్థానాలకు గాను రెండు స్థానాలు లభిస్తాయని వైసీపీ నేతలు ఊహించారు. అయితే బోసు నాయకత్వ లోపంతో మూడు స్థానాలనూ వదుకోవల్సి వచ్చిందని వాపోతున్నారు. బోసు నిర్లక్ష్య వైఖరి కారణంగానే స్వంత సామాజికవర్గం (శెట్టిబలిజ) ఉన్న 25వ వార్డులో తెలుగుదేశానికి 700 ఓట్లు లభించగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు కేవలం 148 ఓట్లు దక్కడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. గెలవాల్సిన చోట కూడా ఇంత దారుణంగా ఓడిపోతే భవిష్యత్‌లో రామచంద్రపురం నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని సాక్షాత్తూ ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. 

ఇదిలావుంటే రామచంద్రపురంలోని కె గంగవరం, కాజులూరు వైసీపీ కన్వీనర్లు ప్రజల్లో రావడం లేదన్న విమర్శలున్నాయి. ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా పార్టీకి దూరమవుతుండటం పట్ల కార్యకర్తలు వాపోతున్నారు. ఈ పరిణామాలను చూసి పార్టీ అధినేత జగన్‌కు విధేయులుగా ఉండి, పార్టీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్న నేతలు బోసు శల్యసారథ్యం పట్ల తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. ఇటీవల జరిగిన పమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బోసు వ్యవహరించిన తీరుకు నియోజకవర్గంలో పార్టీ పరువు పోయిందని కార్యకర్తలు వాపోతున్నారు. పమ్మెల్సీ పన్నికల్లో వైసీపీకి తగిన సంఖ్యాబలం లేనప్పటికీ ఈ నియోజకవర్గం నుండి పమ్మెల్సీగా స్థానిక పంపీటీసీని బరిలోకి దించడం, తర్వాత టీడీపీ నుండి భారీగా సొమ్ము తీసుకున్నట్టు బయటకు పొక్కడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. ఈ కారణంగానే పమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకునేందుకు పంత తీసుకున్నారో చెప్పాలంటూ రామచంద్రపురం పమ్మెల్యే తోట త్రిమూర్తులు బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం!

Show comments