'స్పైడర్' పోస్టర్స్, 'స్పైడర్' గ్లింప్స్.. ఇవన్నీ చూశాక, ఆ సినిమాపై మహేష్ అభిమానులే కాదు, సినీ ప్రేక్షకులూ ఓ 'ఐడియా'కి వచ్చేసి వుంటారు. టెక్నికల్‌గా సూపర్బ్ సౌండింగ్ వుండే సినిమా 'స్పైడర్' అని ఆశించకుండా ఎలా వుండగలం.? 'గ్లింప్స్' ఆ స్థాయిలో వుంటే, టీజర్ ఇంకెలా వుండాలి.!
అయితే, టీజర్‌తో మాత్రం చిన్న షాక్ ఇచ్చేశారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ బయటకొచ్చింది. టీజర్‌లో మహేష్‌ని సాదా సీదాగానే చూపించారు. ఓ మామూలు హీరోకి సినిమాటిక్ బిల్డప్ వున్నట్లుందే తప్ప, అంతకు మించిన టెక్నికల్ ప్రొజెక్షన్ పెద్దగా లేకపోవడం గమనార్హం.
హైద్రాబాద్ మహానగరం, అందులో ఓ విలన్.. ఆ విలన్‌ని మట్టికరిపించే హీరో.. ఇదీ టీజర్ ద్వారా చెప్పిన విషయం. జనాభాని తగ్గించేందుకోసమంటూ విలన్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా అన్పిస్తుంది. 'భయపెట్టడం మాకూ తెలుసు..' అని చివర్లో మహేష్ చెప్పిన డైలాగ్ మహేష్ అభిమానుల్ని అలరిస్తుంది.
కాస్త మాస్ టచ్ ఇచ్చేందుకు, టీజర్‌ని పెర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేశారనుకోవాలేమో.! అంతా టీజర్‌లోనే చెప్పేస్తే కిక్ వుండదు కదా.! మహేష్ అభిమానుల్ని అయితే టీజర్ ఫుల్లుగా ఖుషీ చేసేసింది. మరి, ట్రైలర్ వచ్చేసరికి సీన్ మారుతుందా.? ఇంతకీ, ఇది జేమ్స్‌బాండ్ తరహా సినిమాయేనా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.
అన్నట్టు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో 'బ్లైండ్ డేట్ కావాలి..' అని చెప్పించిన దర్శకుడు, సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వుండబోతోందని టీజర్‌తోనే సంకేతాలు పంపాడండోయ్.