జగదేక వీరుడు అతిలోక సుందరి, మెగాస్టార్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు ఆ సినిమాను కాస్త ఉన్నంతలో ఉన్నంతగా రీ ప్రొడ్యూస్ చేద్దామని చూస్తున్నట్లు వుంది. ఏంజెల్ ట్రయిలర్ చూస్తుంటే. నాగ అన్వేష్-హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు డైరక్టర్ పేరే బాహుబలి పళని.
బాహుబలి మాదిరిగానే గ్రాఫిక్స్ బాగా వున్న సినిమా. జగదేక వీరుడు అతిలోక సుందరి ఛాయలు కనిపిస్తున్నాయి కథలో. ఆ సినిమా మాదిరిగానే పక్కా సోషియో ఫాంటసీ లక్షణాలు కనిపిస్తున్నాయి. గంధర్వ రాజు కుమార్తె, ఏదో కారణాన భూలోకం రావడం, హీరో దగ్గరకు చేరడం.
అయితే ఇక్కడ తేడా ఒకటే కనిపిస్తోంది. విలన్ కూడా భూలోక వాసి కాకుండా, అతీత శక్తులున్న గంధర్వలోక వాసి అన్నమాట. ట్రయిలర్ సంగతి ఎలా వున్నా, కాస్త గ్రాఫిక్స్ వగైరాలకు బాగానే ఖర్చు చేసినట్లున్నట్లు కనిపిస్తోంది. చాలా కాలంగా విడుదల డ్యూ వున్న ఈ సినిమా త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.
అందుకే ఇప్పుడు ట్రయిలర్ వదిలి, పబ్లిసిటీ షురూ చేసారు. అన్నీ బాగానే వున్నాయి కానీ, టీజర్ కు ట్రయిలర్ కు పెద్ద తేడా లేకుండా చేసారు. అందులోవే ఇందులో రిపీట్ చేసి. ఎందుకనో?