నివురుగప్పిన నిప్పుగా గోదావరి జిల్లాలు

మీడియాలో కనిపించినంత ప్రశాంతగా ఇప్పుడు గోదావరి జిల్లాలు లేవు. మీడియాలో దాచేసినంత సైలెంట్ గా గోదావరి జిల్లాలో ప్రజలు లేరు. మీడియా మూసేసిన అసలు దృశ్యం గోదావరి జిల్లాల్లో జనాలకు కనిపిస్తోంది.

అవును నిజమే..ముద్రగడ వార్తలు, దానిపై కాపుల భావజాలం..స్పందన తక్కువ..తేదేపా-వైకాపా నాయకులు వాదన ప్రతి వాదనలు ఎక్కువగా మన మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ వాస్తవం వేరుగా వుంది. మిగిలిన జిల్లాల కాపుల సంగతి ఎలా వున్నా, గోదావరి జిల్లాల సంగతి వేరుగా వుంది. అక్కడ జరుగుతున్న అరెస్టుల పర్వం కాపులను కుదిపేస్తోంది. అరెస్టు అవుతున్నవారు అంతా తొంభైతొమ్మిది శాతం మంది కాపు నాయుకలే. వీరిలో వివిధ పార్టీల వారు వున్నారు. 

పార్టీల సంగతి ఎలావున్నా, అరెస్టులు జరుగుతున్న తీరులు కాపుల్లో ఆగ్రహాలను రగులుస్తున్నాయి. నేరుగా వారంట్ తీసుకువచ్చి, లేదా ఎప్ఐఆర్ పెట్టి వీరిని అరెస్టు చేయడం లేదు..మాట్లాడాలి స్టేషన్ కు రండి అని తీసుకెళ్లి..అక్కడ జరపాల్సిన తంతులు జరిపాక అరెస్టలు చూపిస్తున్నారు. ఇది సహజంగానే కాస్త భయానక వాతావరణాన్ని కలిగిస్తోంది.

బాబుకే సమస్య Readmore!

చంద్రబాబు కానీ ఆయన ముందుకు తోసి నడిపిస్తున్న కాపు మంత్రులు కానీ, సమస్యను విజయవంతంగా వైకాపా వైపు తిప్పుతున్నాం అనుకుంటున్నారు కానీ, కాపుల్లో అంతర్గతంగా రగులుకుంటున్న వ్యవహారాలు గమనించడం లేదు. కానీ దీనివల్ల వారికి సమస్య లేదు. ఎందుకంటే అవసరం అయితే 2019లో వేరే పార్టీల్లోకి వెళ్లగలవారే వీరంతా..గంటా కావచ్చు.. నారాయణ కావచ్చు. ఎవరైనా.. వీళ్లు తెలుగుదేశంలో వున్నా, మరే పార్టీలో వున్నా కాపు నాయకులే.. కాపులు పార్టీలతో సంబంధం లేకుండా వీళ్లను ఏక్సెప్ట్ చేసే అవకాశం వుంది. 

కానీ చంద్రబాబును అందరు కాపులు ఏక్సెప్ట్ చేయడం అన్నది మాత్రం జరగదు. ఇంతకు ముందు మాత్రం కాపులు వివిధ పార్టీలకు ఓటేయలేదా? అందరు బాబు పార్టీకే ఓటేసారా అని లాజిక్ తీయచ్చు..కానీ విషయం అది కాదు. బాబుకు దూరంగా జరిగే కాపుల సంఖ్య పెరిగే అవకాశాన్ని బాబే చేచేతులా ఇస్తున్నారు. ఆయన ముద్రగడ ఉద్యమాన్ని అణచివేస్తున్నా అనుకుంటున్నారు కానీ, కొంతమంది కాపులకైనా దూరం అవుతున్నారన్న సంగతి మరిచిపోతున్నారు.

ఒకేసారి చేసి వుంటే..

నిజానికి అరెస్టులు ఏవో ఒకేసారి చేసేసి వుంటే.. కాస్త హడావుడి జరిగి, మీడియా తెరల చాటున కాస్త కప్ఫబఢిపొయి వుండేది. కానీ ఇలా విడతలు విడతలుగా, ఏరియాల వారీ అరెస్టులు సాగిస్తూ వుంటే.. మెల్ల మెల్లగా రాజుకుంటోంది గోదావరి జిల్లాల కాపుల్లో అసంతృప్తి. దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడితే సరే. లేదూ అంటే ఆ అసంతృప్తి పెరిగితే సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అప్పుడు పరిస్థితిని బాబు పంచన వున్న కాపుమంత్రులు కూడా చక్కదిద్దలేరు. 

Show comments