పవన్ ఎక్కడికి వెళ్లాడో తెలుసా...?

కొత్త సినిమా కాటమరాయుడు రిలీజ్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు. ఆ సినిమాకు ప్రచారం కల్పించాల్సిన కీలకమైన సమయం. పవన్ కల్యాణ్ ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తాడని మీడియా అంతా ఎదురుచూసిన రోజు. అలాంటి రోజున పవన్ కల్యాణ్ ఎవరికీ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడో చాలామందికి తెలీదు. కొందరు ఫాంహౌజ్ లోనే ఉన్నాడన్నారు. మరికొందరు అమెరికా వెళ్లాడన్నారు. ఇలా ఎన్నో పుకార్లు.
 
పవన్ ఎక్కడికి వెళ్లాడో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఇచ్చింది మరెవరో కాదు.. స్వయంగా రేణుదేశాయ్. తన కూతురు ఆద్య పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడు పవన్. పూణెలో రేణుదేశాయ్ తో పాటు ఉంటోంది ఆద్య. ఈ ఏడాది సరిగ్గా కాటమరాయుడు రిలీజ్ కు ముందురోజు ఆద్య పుట్టినరోజు పడింది. దీంతో పవన్ తన సినిమా కంటే కూతురు పుట్టినరోజుకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకే పూణె వెళ్లిమరీ వేడుకల్లో పాల్గొన్నాడు.
 
ఈ విషయం పవన్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరుముగ్గురికి మాత్రమే తెలుసు. తాజాగా ఆద్య బర్త్ డే సెలబ్రేషన్ పిక్స్ ను రేణుదేశాయ్ సోషల్ మీడియాలో పెట్టడంతో అందరికీ తెలిసింది.

Show comments