ప్రముఖ నటి, మహిళా ఎంపీ రోజూ పీకల్దాకా తాగుతుంది!

భారతీయ జనతా పార్టీ ఎంపీ, బాలీవుడ్ అలనాటి డ్రీమ్ గర్ల్.. హేమ మాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు మహారాష్ట్ర ఎమ్మెల్యే ఒకరు. ఆమె రోజూ పీకల్దాకా తాగుతుంది.. అని వ్యాఖ్యానించి వివాదాన్ని రాజేశాడితను. ఆమెకు ఏ మాత్రం సంబంధం లేని అంశంలోకి ఆమెను లాగి.. ఆమె మీద అనుచిత వ్యాఖ్యానాలు చేసిన ఆ ఎమ్మెల్యే పేరు బచ్చూ ఖడు. ఏ పార్టీకి చెందని వ్యక్తి. ఇండిపెండెంట్ గా గెలిచాడు. అలాగే ఉన్నాడు. రైతుల ఆత్మహత్యల అంశంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాడు ఈ ఎమ్మెల్యే. ఇదే సమయంలో.. రైతులు మద్యపానం వల్లనే ఆత్మహత్యలు చేసుకొంటారు.. అని కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యానాలపై ఈయన తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు.

తాగడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అనడాన్ని ఖండిస్తూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ప్రతి రోజు తాగుతారు కదా.. వాళ్లెవ్వరూ ఆత్మహత్యలు చేసకోవడం లేదే? అని ఖడూ ప్రశ్నించాడు. ‘నూటికి డెబ్బై ఎనభై మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి రోజూ మద్యపానం చేస్తారు. వాళ్లెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదే. నటి హేమమాలిని ఉన్నారు.. ఆమె లోక్ సభలో ఎంపీ. ఆమె ప్రతి రోజూ తాగుతారు.. ఫుల్ గా మందు కొడతారు. అందరి ఎంపీల్లానే ఆమె కూడా తాగుతారు. మరి వీళ్లెవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదే...’ అంటూ ఖడూ ఆవేశంగా అనేశాడు. మరి రైతుల విషయంలో ఖడూ ఆవేదన బాగానే ఉంది కానీ.. మధ్యలో హేమమాలిని వ్యక్తిగతంగా లాగడం మాత్రం ఏ మాత్రం పద్ధతిగా లేదు. ఆమె వ్యక్తిగత అలవాట్ల గురించి అనుచితమైన మాటలు మాట్లాడటం సబబు కాదు. ఏదో దగ్గరుండి చూసినట్టుగా ఈయన ఇలా మాట్లాడటం తీవ్రమైన వ్యవహారమే.

Readmore!
Show comments