రెండోసారి వరద.. సీమకు మరింత జలకళ!

గత పదేళ్లలో ఏ సంవత్సరంలో అయినా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఒక్కసారి నామమాత్రంగా ఎత్తడమే గొప్ప అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఒక్కసారి గేట్లు ఎత్తి రెండు రోజులకే మూత వేసే వాళ్లు. ఆ స్థాయిలో మాత్రమే కృష్ణానదిపై నీటి లభ్యత ఉండేది. అయితే ఈ ఏడాది రోజుల తరగబడి శ్రీశైలం గేట్లను ఎత్తి నీళ్లను కిందకు వదలడమే కాదు, కొన్నిరోజుల విరామం అనంతరం మళ్లీ శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో మరోసారి నీటిని దిగువకు విడుదల చేశారు.

అలా దిగువకు విడుదల చేసిన నీరు నాగార్జున సాగర్‌ను కూడా నింపి, పులిచింతలను నింపి, ప్రకాశం బ్యారేజ్‌ మీదుగా.. సముద్రంలోకి కలిసిపోతూ ఉంది. సముద్రంలో కలిసే నీళ్లు అయినా రాయలసీమకు అందితే బావుంటుందనేది అక్కడి ప్రజల ఆశ. శ్రీశైలం నుంచినే నీటిని రాయలసీమ వైపు మరింతగా మళ్లించే అవకాశాలను ప్రభుత్వం ఇకనైనా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే ఎంతోకొంత మేలు ఏమిటంటే.. ఈసారి శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డుస్థాయి నీటిలభ్యత ఉండటం. దీంతో గతంతో పోలిస్తే ఈసారి కచ్చితంగా రాయలసీమకు నీటిలభ్యత ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే నీరు అనంతపురం వరకూ చేరింది. అక్కడ నిర్మించిన చిన్న చిన్న రిజర్వాయర్లను నింపడంతో పాటు.. చెరువులకు కూడా నీరు వదలుతూ ఉన్నారు. వివిధ చెరువుల కింద ఈసారి ఆయకట్టు ప్రాంతాన్ని కూడా తడపడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాయలసీమ ప్రజలకు జగన్‌ పాలనలో అందుతున్న శుభవార్తే ఇది.

మారని తీరు.. అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!

Show comments