న్యూడ్‌ వీడియో: ట్విట్టర్‌ నేర్పిన పాఠం

సింగర్‌ సుచిత్రా కార్తీక్‌ ట్విట్టర్‌ నుంచి కొన్ని ఫొటోలు విడుదలయ్యాయి. ఓ వీడియో కూడా బయటకొచ్చింది. పొటోలు చూస్తే, అంతా 'ఒరిజినల్‌' అనే అన్పిస్తోంది. కానీ, వీడియో విషయంలోనే తేడా కొట్టేస్తోంది. ఆ వీడియోలో వున్నది ఓ హీరోయిన్‌. పేరెందుకుగానీ, ఆమె తన గురించి జరుగుతున్న 'నగ్న' ప్రచారం నేపథ్యంలో ఆవేదన చెందింది, అలర్ట్‌ అయ్యింది.. అదంతా ట్రాష్‌ అని కొట్టి పారేసింది. 

ఒకప్పుడు వీడియో క్యాసెట్లు పెట్టుకుని బూతు సినిమాలు చూసేవారు కొందరు. అది చాలా కష్టమైన వ్యవహారం. ఆ తర్వాత సీడీలొచ్చాయి.. ఇంటర్నెట్‌తో మొత్తం సీన్‌ మారిపోయింది.. అరచేతిలో స్మార్ట్ మొబైల్‌ వుంటే చాలు, అన్నీ అందులోకొచ్చేస్తున్నాయి. పెన్‌డ్రైవ్‌లు, మెమరీ కార్డ్‌లు.. ఇలా అంతా 'స్మార్ట్‌' అయిపోయిన విషయం విదితమే. సోషల్‌ మీడియాలో ఒక్కసారి ఏదన్నా పడితే, అంతే సంగతులు. క్షణాల్లో ప్రపంచం చుట్టేస్తోంది ఏ విషయమైనాసరే. అది నిజమా.? కాదా.? అన్నది వేరే విషయం. రచ్చ జరిగిపోవాలంతే. 

అసలెందుకు సుచిత్రా కార్తీక్‌ ఇదంతా చేసింది.? అంటే, 'అబ్బే.. దాంతో నాకు సంబంధం లేదు.. నేనేమీ చేయలేదు..' అంటోందామె. ఆమెకు తెలియకుండా ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయి వుండొచ్చుగాక. ఈ పరిస్థితుల్లో దాన్ని డీ-యాక్టివేట్‌ చేయడం ఉత్తమం. లేదంటే, పోలీసులకు ఆమె స్వయంగా ఫిర్యాదు చేయడం మంచిది. ధనుష్‌ విషయంలో ముందుగా వెలుగు చూసిన 'అభ్యంతకర పోస్ట్‌'తోనే ఆమె అలర్ట్‌ అవ్వాలి. కానీ, అలర్టవలేదు. దాంతో, ఇప్పుడింత రచ్చ జరుగుతోంది. 

ముద్దుల ఫొటోలు.. ఆ మాటకొస్తే అసభ్యకరమైన ఫొటోలు.. వీటిని సింపుల్‌గా 'మార్ఫింగ్‌' అని కొట్టి పారేయొచ్చు. వీడియో విషయంలోనూ మార్ఫింగ్‌ అనాలంటే నమ్మేలా వుండవవి. సదరు హీరోయిన్‌, కాస్త ధైర్యంగానే సోషల్‌ మీడియా ద్వారా తాను చెప్పదలచుకున్నది (వీడియో రూపంలో) చెప్పిందిగానీ, జరిగిన డ్యామేజ్‌ తక్కువేమీ కాదు. సెలబ్రిటీలకు సోషల్‌ మీడియా అకౌంట్‌ అంటే అదో సరదా అయిపోయింది. సరిగ్గా మెయిన్‌టెయిన్‌ చెయ్యకపోతే పరిస్థితులు ఇలానే తగలడ్తాయ్‌. ఇంతకీ, సుచిత్రకు తెలియకుండానే ఇదంతా జరిగిందా.? ఇది మాత్రం ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

Show comments