సమంతకు ఇక నో చాన్స్?

పెళ్లి కుదిరిన దగ్గర నుంచి, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, పెళ్లి వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి సమంతకు కొత్త సినిమా సంతకం అన్నది లేకుండాపోయింది.

మొన్నటికి మొన్న రామ్ చరణ్ సినిమాలో సమంత హీరోయిన్ గా ఫిక్స్ అన్నమాట వినిపించింది. దాంతో మళ్లీ ట్రాక్ మీదకు వచ్చేసినట్లే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాకు అనుపమ పరమేశ్వరన్ ను ఫిక్స్ చేసుకున్నారు.

సావిత్రి బయో పిక్ లో సమంత అన్నారు. కానీ అబ్బే..లేదు అని తేలిపోయింది. ఎన్టీఆర్-బాబి సినిమాలో కూడా సమంతకు చాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నటించని వారితోనే సినిమా చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇంకెవరు వున్నారు ఇప్పుడు హీరోయిన్ కోసం వెదుకుతూ? సో, సమంతకు ఇప్పట్లో తెలుగునాట సినిమాలు లేవనే అనుకోవాలి. ఏ డైరక్టర్ అయినా డిఫరెంట్ గా లేడీ ఓరియెంటెడ్ కథ, సినిమా రెడీ చేస్తే సమంతను ట్రయ్ చేయవచ్చేమో? కానీ అలాంటి సినిమాలు చేసే వారి దృష్టి సమంత మీద మాత్రం పడదు.

ఎందుకో మరి?అయిన సమంతకు ఏమొచ్చె..హ్యాపీగా కాబోయే భర్త నాగ్ చైతన్యతో కలిసి క్రిస్మస్ ఏర్పాట్లలో బిజీగా వుంది.

Show comments