నిఖిల్ కెరీర్ లో హయ్యస్ట్

ఒక్క శంకరాభరణం సినిమాను తప్పిస్తే, స్వామిరారా నుంచి ఒక్కో మెట్టు పైకే ఎక్కుతూ వస్తున్నాడు హీరో నిఖిల్. లేటెస్ట్ గా ఈవారం విడుదల కాబోతున్న కేశవ కూడా నిఖిల్ కెరీర్ లో మరో మలుపు కాబోతోంది. తొలిసారి నిఖిల్ సినిమా వరల్ఢ్ వైడ్ గా దాదాపు 800 స్క్రీన్ లలో విడుదల అవుతోంది. నైజాంలో 250, సీడెడ్, ఆంధ్రల్లో 400, ఓవర్ సీస్ లో 170 (యుఎస్ 120 యుఎఇ 50) స్క్రీన్ లలో విడుదలవుతోంది.

నిఖిల్ కెరీర్ లో ఇది చాలా హయ్యస్ట్ నెంబర్. అలాగే సినిమా మార్కెట్ కూడా ఆ రేంజ్ లోనే జరిగింది. శాటిలైట్, డిజిటిల్, రీమేక్, అదర్ లాంగ్వేజ్, థియేటర్ రైట్స్ అన్నీ కలిపి 18 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. పైగా ఈ సినిమాను జస్ట్ ఏడు నుంచి ఏడున్నర కోట్ల ప్యాకేజ్ తో ఫినిష్ చేసారు. దీంతో పెద్ద నిర్మాతల కన్ను నిఖిల్ పై పడింది. పెద్ద హీరోలతో సినిమాలు చేసే సంస్థలన్నీ నిఖిల్ ను అప్రోచ్ అవుతున్నాయి. కానీ నిఖిల్ మూడు సినిమాలు వరుసగా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, (కిర్రాక్ పార్టీ) కలైపులి థాను (కణితన్), దిల్ రాజు (కార్తికేయ 2) లకు కమిట్ అయిపోయాడు. కేశవ కూడా హిట్ అనిపించుకుంటే, నిఖిల్ మిడిల్ రేంజ్ హీరోల్లో టాప్ త్రీ జాబితాలోకి చేరిపోతాడు.

Show comments