పోర్న్ సినిమాల్లోంచి బాలీవుడ్ తెరపైకొచ్చి, బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ మూవీస్‌తో దూసుకెళ్తోన్న అందాల భామ సన్నీలియోన్, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ కాసుల పంట పండించుకుంటోన్న విషయం విదితమే. సంపాదనలో సన్నీలియోన్‌ని చూసి బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సైతం షాక్‌కి గురవుతున్నారు.
గతంలో వున్న పోర్న్‌స్టార్ ఇమేజ్ సన్నీలియోన్‌కి బాగా హెల్పవుతోంది ఆయా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంలో. మ్యాన్ ఫోర్స్ కండోమ్ యాడ్ అలా సన్నీలియోన్‌కి దక్కిందే. ఇక, తాజాగా సన్నీలియోన్ ఐదు కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుందట. ఇదిప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ సంక్షోభం నేపథ్యంలో, ఓ ఫుడ్ ఛెయిన్ గ్రూప్ సన్నీలియోన్‌తో డిజిటల్ మార్కెటింగ్‌పై ప్రచారం షురూ చేస్తోంది. ఇందుకోసం, భారీ ఒప్పందం కుదిరింది ఆ ఫుడ్ ఛెయిన్ గ్రూప్‌కీ, సన్నీలియోన్‌కీ మధ్య. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రచారంలో సన్నీలియోన్ భర్త కూడా పాల్గొంటాడు. మరోపక్క, ఓ ప్రముఖ పెర్ఫ్యూమ్ బ్రాండ్ సన్నీలియోన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. అయితే, సన్నీలియోన్ సుమారు 6 కోట్లదాకా డిమాండ్ చేస్తోంటే, ఆ సంస్థ నుంచి 4 కోట్ల ఆఫర్ మాత్రమే వస్తోందట. అతి త్వరలోనే ఇది కూడా ఫైనలైజ్ కానుందని తెలుస్తోంది.