ప్రభాస్ శివుడు కాదు?

కన్నప్ప సినిమాలో ఎప్పుడైతే ప్రభాస్ ఉన్నాడనే న్యూస్ బయటకొచ్చిందో.. ఆ వెంటనే అంతా అతడే శివుడని ఫిక్స్ అయిపోయారు. ప్రభాస్ ను శివుడి గెటప్ లో చూపిస్తూ గ్రాఫిక్స్ కూడా వచ్చేశాయి. పక్కనే నయనతారను పార్వతిగా చూపిస్తూ.. ఎన్నో డిజైన్లు పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడీ కథనాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఉన్నాడనేది వాస్తవం. అయితే అతడు పరమ శివుడి పాత్రలోనే కనిపిస్తాడా లేదా అనేది ఇప్పుడు అందరి డౌట్. ఎందుకంటే, ఈ ప్రాజెక్టులోకి తాజాగా అక్షయ్ కుమార్ వచ్చి చేరాడు. అంతవరకు ఓకే కానీ, మంచు విష్ణు చేసిన ప్రకటనతోనే అసలైన అనుమానం మొదలైంది.

తమ సినిమాలోకి అక్షయ్ వచ్చాడని ప్రకటించిన మంచు విష్ణు.. త్వరలోనే తామిద్దరం కలిసి కన్నప్ప క్లైయిమాక్స్ షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నాడు. కన్నప్ప క్లయిమాక్స్ ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. పైగా అక్షయ్ కుమార్ కు ఇంతకుముందు శివుడిగా నటించిన అనుభవం కూడా ఉంది.

సో... కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు జనం. అదే కనుక నిజమైతే, ప్రభాస్ పాత్ర ఏంటి? అసలు ప్రభాస్ క్యారెక్టర్ నిడివి ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

కన్నప్ప సినిమాకు సంబంధించి న్యూజిలాండ్ లో 2 భారీ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లోనే మంచు విష్ణు, అక్షయ్ కుమార్ మధ్య క్లయిమాక్స్ పార్ట్ షూట్ చేయబోతున్నారు.

Show comments

Related Stories :