లండన్ బాబులంట

వెరైటీ టెటిళ్లు పెట్టడంలో డైరక్టర్ మారుతి కాస్త క్రియేటివిటీ చూపిస్తుంటారు. ఒక పక్క యువి బ్యానర్ లో శర్వానంద్ తో మహానుభావులు సినిమా సైలెంట్ గా ఫినిష్ చేస్తూనే, మరో పక్క తను కథ ఇచ్చి, కథ, మాటలు ఇస్తూ, ఇలా రకరకాలుగా మూడు సినిమాలు స్లయిమెంటేనియస్ గా నడిపించేస్తున్నాడు. అలాంటి సినిమాల్లో కలర్స్ స్వాతి నటిస్తున్న సినిమా కూడా వుంది. చిన్న సినిమాలు ఒకటి రెండు అందించిన చిన్న కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. తమిళ కథ ఆధారంగా తయారవుతోందీ సినిమా.

ఈ సినిమాకు లండన్ బాబులు అని టైటిల్ ఫిక్స్ చేసారట. భలే భలే మగాడివోయ్ హిట్ అయిన దగ్గర నుంచి బి సెంటిమెంట్ పట్టుకున్నట్లుంది మారుతికి. టైటిల్ లో బి సౌండ్ వినిపించాల్సిందే. ఆ వెంటనే వెదికి వెదికి మరీ బాబుబంగారం టైటిల్ ఫిక్స్ చేసాడు. తరవాత మహాను భావుడు టైటిల్.  ఇప్పుడు మళ్లీ లండన్ బాబులు. ఇంకెన్ని బి లు వస్తాయో? చూడాలి.

Show comments