ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదే కాలా రిలీజ్

రోబోకు సీక్వెల్ గా రానున్న 2.0 మూవీ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డంతో, రజనీకాంత్ నుంచి సినిమా రాకుండానే ఈ ఏడాది ముగిసిపోతుందని తళైవ ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు. కానీ కాలా వస్తున్నాడు. అవును.. 2.0 సినిమా కంటే ముందే, అంటే ఈ ఏడాదిలోనే కాలా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పా రంజిత్ దర్శకత్వంలో ప్రస్తుతం ముంబయిలో కాలా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే చెన్నైలో వేసిన "థారావి సెట్"లో వెంటనే మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇలా గ్యాప్ ఇవ్వకుండా 4 నెలల్లో సినిమాను కంప్లీట్ చేసి, ఏడాది చివరినాటికి కాలాను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ మేరకు రజనీకాంత్, నిర్మాత ధనుష్, దర్శకుడు పా రంజిత్ ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వకుండా గ్రాఫిక్ వర్క్ కూడా బాగా తగ్గిస్తున్నారు. ఇక షూటింగ్ కు సంబంధించి షెడ్యూల్స్ కూడా చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ చివరి వారంలో "కాలా భాయ్" థియేటర్లలో సందడి చేయడం ఖాయం.

ఈ ఏడాది రిలీజ్ కోసమే, సినిమా సెట్స్ పైకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రచారాన్ని కూడా ప్రారంభించింది యూనిట్. ఎప్పటికప్పుడు వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేస్తోంది. కాలా సినిమాకు సంబంధించి ఇప్పటికే కీలకమైన నటీనటులు, టెక్నీషియన్ల ఎంపిక పూర్తయింది. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.

Readmore!

Show comments