ప్రశ్న వదిలేసి జవాబా?

ఇటు పవన్ అటు జగన్... రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేసిన అన్యాయంపై ఏదో రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిరసన ను యథాశక్తి కనిపించకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. బాబు కోసం ఏమయినా, ఎంతయినా చేయడానికి సిద్దమయ్యే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఇందులో పాలు పంచుకుంటోంది. పవన్ వార్తలు పక్కన పెట్టారు. జగన్ పై విమర్శ లకు కావాల్సినంత చోటిచ్చారు.

నిరసనను మాత్రం లోకల్ ఎడిషన్లలోకి తొక్కారు. అయినా ఇంకా అనుమానమే. జనం గుండెల్లో హోదా గురించి, కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి, వెంకయ్య నాయుడు వ్యవహార శైలి గురించి వారిలో అసంతృప్తి వుందేమో అన్న అనుమానం. ప్రతిపక్షాల మాట తాము ఎంత నొక్కేస్తున్నా జనానికి చేరిపోతోందేమో అన్న అనుమానం. అందుకే ఈ రోజు మరో అడుగు ముందు కు వేసి వెంకయ్య నాయుడుతో దాదాపు ఫుల్ పేజీల ఇంటర్వూను అచ్చొత్తి వదిలారు. ఆయన ఎంత కష్టపడుతున్నదీ, ఆంధ్రతో అవసరం లేకపోయినా, కూడా ఎంత చేస్తున్నదీ? ఇలా ఎంతో ఏకరవు పెట్టారు.

ఇదంతా వెంకయ్యను, మోడీని, కేంద్రాన్ని నిందల బారి నుంచి తప్పించడానికి తప్ప వేరు కాదని తెలుస్తున్నదే. కానీ వారిని తప్పించడం లో వున్న శ్రద్ధ, జరుగుతున్న అన్యాయాన్ని చాటుతున్న జగన్, పవన్ లపై లేదు. వారితో ఇంటర్వూలే లేవు. మరి మనది మందిస్వామ్యమా? మీడియా స్వామ్యమా? 

Show comments