మంచి ప్రాజెక్టు పట్టేసిన నాగశౌర్య

హీరో నాగ శౌర్య సైలెంట్ గా మంచి ప్రాజెక్టు పట్టేసాడు. తమిళ సినిమాల నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ తెలుగు-తమిళ ప్రాజెక్టు ను స్టార్ట్ చేసేసాడు. షూటింగ్ సాగుతోంది. పైగా ఈ సినిమాకు విజయ్ (అమలాపాల్ భర్త) డైరక్టర్. ప్రేమమ్ మళయాల సినిమాతో ఫేమస్ అయిన సాయి పల్లవి హీరోయిన్. ఇప్పటికే శౌర్య ఓ సినిమా తెలుగులో చేస్తున్నాడు. ఓ సినిమా విడుదలకు రెడీగా, రెండు సినిమాలు షూట్ లో వుండగా, మరో సినిమా సుకుమార్ బ్యానర్ లో స్టార్ట్ కావాల్సి వుంది.

ఇటీవల తమిళ నిర్మాతల కన్ను తెలుగు హీరోలపై పడింది. నిఖిల్ తో కలైపులి థాను ఓ సినిమా చేయబోతున్నారు. అలాగే మరో తమిళ నిర్మాత హీరో రాజ్ తరుణ్ తో సినిమా చేయబోతున్నారు. దీనికి బిచ్చగాడు సినిమా అందించిన దర్శకుడు దర్శకత్వం వహిస్తారు. ఇక బన్నీ తో స్టూడియో గ్రీన్ ఇప్పటికే సినిమా అనౌన్స్ చేసింది.

Show comments