అన్నంత పని చేశాడు.. మహర్షిపై మళ్లీ డౌట్స్?

వంశీ పైడిపల్లితో సినిమా అంటేనే రీషూట్లు, వాయిదాలకు మానసికంగా సిద్ధపడి రంగంలోకి దిగాలి. ఇండస్ట్రీలో ఈ దర్శకుడిపై కామన్ గా వినిపించే కంప్లయింట్ ఇది. ఇలాంటి డైరక్టర్ కు మహేష్ లాంటి హీరో తోడైతే ఇంకేముంది, ఆ సినిమా విడుదల గాల్లో దీపమే. మహర్షి సినిమా విడుదలపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి.

లెక్కప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలకావాలి. కానీ ఏప్రిల్ 25కు వాయిదావేశారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా వచ్చేది అనుమానమే అంటున్నారు. ఈ మేరకు మహర్షి యూనిట్ నుంచి లీకుల పర్వం మొదలైంది. 

సినిమాకు సంబంధించి ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉందట. ఏ రేంజ్ లో పెండింగ్ ఉందంటే, సినిమాను మరో 2 వారాలు వాయిదావేసినా ఆ పని పూర్తికాదని తెలుస్తోంది. అందుకే ఈసారి ఏకంగా ఏప్రిల్ నుంచి జూన్ కు మహర్షి సినిమా విడుదలను వాయిదా వేసే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే ఈసారి వాయిదాకు కేవలం వంశీ పైడిపల్లిని మాత్రమే వేలెత్తి చూపించలేం అంటున్నారు యూనిట్ సభ్యులు. నిర్మాతల మధ్య అభిప్రాయ బేధాలతో పాటు మహేష్ కూడా షూటింగ్ కు డుమ్మా కొట్టడం కారణంగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది కాబట్టి ఇప్పటికైనా మేకర్స్, విడుదల తేదీపై ఓ స్పష్టత ఇస్తే బాగుంటుంది. కుదిరితే ఏప్రిల్ రిలీజ్ లేదా మే రిలీజ్ అంటూ ఓ పోస్టర్ వదిలితే ఈ పుకార్లకు చెక్ పెట్టినట్టవుతుంది.