ఏపీలో అతిగా ఆశ‌ప‌డే మ‌గాడు, అతిగా ఆవేశ‌ప‌డే ఆడ‌ది!

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా ఒక‌దాంట్లో బాగా పాపుల‌ర్ డైలాగ్ అతిగా ఆశ‌ప‌డే మ‌గాడు, అతిగా ఆవేశ‌ప‌డే ఆడ‌ది సుఖ‌ప‌డిన‌ట్టుగా చ‌రిత్ర‌లోనే లేదు! అనేది! ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయంలో ఇప్పుడు రెండు క్యారెక్ట‌ర్లు ఇదే త‌ర‌హాలో క‌నిపిస్తూ ఉన్నాయి!

ప‌వ‌న్ క‌ల్యాణ్, వైఎస్ ష‌ర్మిల‌.. వీరిద్ద‌రిదీ ఇదే తీరు అని చెప్ప‌క త‌ప్ప‌దు! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశ‌ల గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! త‌న‌ను తాను సీఎంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను అంటూ 2019లోనే ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ల్యాణ్. 2024 నాటికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గితే చాల‌నుకునే ప‌రిస్థితికి వ‌చ్చారు! ఇప్ప‌టికీ ప‌వ‌న్ ఆశ‌ల‌కు అయితే హ‌ద్దు లేదు! ఏదో ఒక‌టి జ‌రిగి త‌ను సీఎం కావాల‌నే ఆటిట్యూడ్ తో క‌నిపిస్తూ ఉన్నారు ప‌వ‌న్! ఆయ‌న వీరాభిమానుల ఆశ‌లు కూడా ఇలానే ఉన్నాయి. ప్ర‌జ‌లు ఎన్నుకుంటే ఏనాటికీ ప‌వ‌న్ సీఎం కాలేర‌నే క్లారిటీ వారికి ఉండ‌నే ఉంది. అందుకే సీఎం ప‌ద‌వి విష‌యంలో వారి ఆశ‌లు అడ్డ‌దారుల మీదే ఉన్నాయి!

ఇక ప‌వ‌న్ ది కేవ‌లం ఆశే కాదు, ఆవేశం కూడా! ఆవేశంలో త‌నేం మాట్లాడుతాడో కూడా ప‌వ‌న్ కు క్లారిటీ ఉండ‌దు! ఇలా మాట్లాడే ప‌వ‌న్ చాలా వ‌ర‌కూ ప‌రువు పోగొట్టుకున్నాడు! 2019 ఎన్నిక‌ల ముందు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ సీఎం కాలేడు, త‌ను కానివ్వ‌నంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ నువ్వెవ్వ‌రు జ‌గ‌న్.. నువ్వెవ్వ‌రు జ‌గ‌న్.. అంటూ ఊగిపోయాడు. మ‌ళ్లీనేమో పాతాళానికి తొక్కేస్తానంటూ ప‌వ‌న్ ప్ర‌తిన‌బూనాడు!

ఆల్రెడీ ప‌వ‌న్ క‌ల్యాణే పాతాళంలో ఉన్నాడు రాజ‌కీయంగా, స‌రిగ్గా జ‌గ‌న్ ను పాతాళానికి తొక్కేస్తానంటూ ప‌వ‌న్ ప్ర‌క‌టించిన త‌ర్వాతే ఆయ‌న పార్టీ ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం 21 సీట్ల‌కు పోటీ చేస్తుంద‌నే క్లారిటీ వ‌చ్చింది! అలా ప‌వ‌న్ మ‌రింత‌గా కూరుకుపోయాడు. ఓవ‌రాల్ గా ఇప్పుడు ప‌వ‌న్ ప‌రిస్థితి ఆశ‌లావు పీక స‌న్నం అన్న‌ట్టుగా సాగుతూ ఉంది!

క‌ట్ చేస్తే.. ర‌జ‌నీకాంత్ డైలాగ్ లో రెండో స‌గానికి న్యాయం చేస్తోంది వైఎస్ ష‌ర్మిల‌! ఆమె ప్ర‌హ‌స‌నం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే! తెలంగాణ‌లో ఎంతో పొడుగు పొడుగు డైలాగులు చెప్పింది. ఇష్టానుసారం మాట్లాడింది. కామెడీ అయిపోయింది. పోటీ కూడా చేయ‌కుండా న‌వ్వుల‌పాలైంది. అక్క‌డ చాల‌ద‌న్న‌ట్టుగా ష‌ర్మిల‌క్క ఏపీలో తైత‌క్క‌లు ఆడుతోంది!  అడ్డ‌దిడ్డంగా మాట్లాడితే త‌ప్ప త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు అనే క్లారిటీ ష‌ర్మిల‌కు ఉన్న‌ట్టుంది. అందుకే చిత్తానికి మాట్లాడుతోంది.

తెగించినోడికి తెడ్డే లింగం అంటారు. ఇప్పుడు ష‌ర్మిల ప‌రిస్థితి కూడా అలానే ఉంది! ఆఖ‌రికి త‌నేం మాట్లాడుతున్నానే స్పృహ‌ను సైతం ఆమె మ‌రిచిన‌ట్టుగా ఉంద‌ని ఆమె మాట‌లు విన్నోళ్ల‌కు అర్థం అవుతోంది. ఈ అతి ఆవేశ‌మే ష‌ర్మిల‌ను న‌వ్వుల పాల్జేస్తోంది. తెలంగాణలో ఆమె చేసిన రాజ‌కీయం కూడా ఇలాంటిదే! అయినా ఆమె పాఠాలు నేర్వ‌లేదు. మ‌రింత యాగీ చేస్తోంది. స్థూలంగా ఎన్నిక‌ల వేళ అతి ఆవేశం, అత్యాశ‌ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్, ష‌ర్మిల‌లు చిత్తానికి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రాజ‌కీయంలో ఏ మాత్రం వ్య‌వ‌హరించ‌ని రీతిలో వీరు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరిన ఆడిస్తున్న వాళ్లు ఎవ‌ర‌నే క్లారిటీ కూడా అందరికీ ఉన్న‌దే! వీళ్లు ఎంత ప్ర‌హ‌స‌నం పాలైనా ఆడిస్తున్న వాళ్లు ఆడించినంత సేపూ ఆడించి ఆ త‌ర్వాత ప‌క్క‌న ప‌డేస్తారు కూడా!

Show comments