ఇక నమ్మకం మీదనే పోటీ!

జగన్ నవరత్నాలు గత ఎన్నికల్లో కీలకం. ఈసారి అందుకు పోటీగా చంద్రబాబు ఆరు హామీలు వదలుతున్నారు. జగన్ తక్కువ తినలేదు కదా.. అందుకే నవరత్నాలు ప్లస్ అంటూ తన జాబితా విడుదల చేయబోతున్నారు.

ప్రతిపక్షం నవరత్నాల మీద ఎంత యాగీ చేసినా, జగన్ మాట నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది జనాలకు తెలుసు. ఎంత సేపూ సిపిఎస్ రద్దు, మద్యనిషేధం ప్రత్యేక హోదా జగన్ వదిలేసారు అని అంటారు తప్ప, తాము చేస్తాము అని చంద్రబాబు ఎందుకు అనరు.

సిపిఎస్ రద్దు చేస్తాం, మద్య నిషేధం చేస్తాం, ప్రత్యేకహోదా సాధిస్తాం అని చంద్రబాబు హామీలు ఇవ్వవచ్చు కదా. జనం ఓటేస్తారు కూడా. కానీ అలా చేయకుండా జగన్ నవరత్నాలను విమర్శిస్తే జనం ఎలా నమ్ముతారు.

అందువల్ల ఇప్పుడు రెండు వైపులా ఎవరి హామీలు వారివి వచ్చేస్తున్నాయి. ఇక మిగిలింది క్రెడిబులిటీ మాత్రమే. ఎవరు హామీలు ఎక్కువగా నిలబెట్టుకుంటారు అన్నదే. హామీల వల్ల రాష్ట్రం నాశనమైపోతుంది అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఆలా అంటున్నవారు కూడా ఫ్రీ పథకాలు, నగదు పథకాలు హామీలుగా ఇస్తున్నారు కదా. పైగా జగన్ పథకాలు కొనసాగిస్తామని కూడా అంటున్నారు.

క్రెడిబులిటీ, మాట నిలబెట్టుకోవడం వరకు వస్తే చంద్రబాబు కన్నా జగన్ ఎక్కువ మార్కులు సాధిస్తారు. పైగా చేతిలో వున్నది వదిలేసి, గాలిలో పిట్టకు మసాలా నూరడం అన్నది సరి కాదనన్నది పెద్దల మాట. జనాలు కూడా ఇదే ఫాలో అయితే ఇప్పటికే ఇస్తున్న జగన్, మరి కాస్త కూడా ఇస్తా అంటున్న జగన్, గతంలో ఇవ్వకున్నా, ఇప్పుడు తాను కూడా ఇస్తా అంటున్న చంద్రబాబు..ఇదీ సీన్.

ఇప్పుడు జనం ఎవరిని నమ్ముతారు. ఎవరివైపు మొగ్గుతారు. ఎవరికి ఓటేస్తారు అన్నదాన్ని మీదే ఓటింగ్.

Show comments