అక్కడ గాజుగ్లాస్ ని పక్కన పెట్టేశారు!

గాజు గ్లాస్ అంటే ఇపుడు గుర్తుకు వచ్చేది జనసేన పార్టీ ఎన్నికల గుర్తు. అయితే ఆ పార్టీ ఏపీలో పోటీ చేస్తున్న సీట్లు పరిమితంగా ఉన్నాయి. కేవలం 21 సీట్లలో మాత్రమే గాజు గ్లాస్ పోటీలో ఉంది. కానీ గాజు గ్లాస్ ఎన్నికల సంఘం వద్ద ఫ్రీ సింబల్ గా ఉంది కాబట్టి దానికి పలు నియోజకవర్గాలలో  చాలా మంది ఇండిపెండెంట్లు తీసుకున్నారు.

దీంతో టీడీపీ కూటమిలో కలవరం రేగింది. విశాఖ ఉత్తరం నియోజకవర్గాలలో గాజు గ్లాస్ గుర్తు మీద ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్న ఒక మహిళా అభ్యర్ధి తో కూటమి అభ్యర్ధులకు తలనొప్పి స్టార్ట్ అయింది. ఆమె ఇంటింటికీ తిరుగుతూ తనను గెలిపించాలని గాజు గ్లాస్ కి ఓటేయాలని ప్రచారం చేసుకుంటున్నారు.

దాంతో విశాఖ ఉత్తరం నుంచి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణు కుమార్ రాజుకు గాజు గ్లాస్ బెడద ఎక్కువైంది. తక్కువలో తక్కువ వేయి ఓట్లు అటు వైపు పడినా తనకే ఇబ్బంది అని గ్రహించి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్ధితో పోటీ నుంచి విరమించుకునేలా చేశారు.

ఆమెతో ప్రెస్ మీట్ పెట్టించి తాను ప్రచారానికి దూరం అని తన పేరు మీద అనుకుని గాజు గ్లాస్ గుర్తుకు ఓటర్లు ఓటు వేయవద్దని చెప్పించారు. ఈ విధంగా ఆమె పోటీ నుంచి లేరని చెప్పించి కొంత ఉపశమనం కూటమి నేతలు పొందారు. కానీ ఈవీఎంలలో అయితే గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది. ఆ గుర్తుకు తెలిసీ తెలియక ఓట్లు పడితే మాత్రం ఆ మేరకు బీజేపీ అభ్యర్థికి నష్టమే అంటున్నారు.

Readmore!

అయినా ఎంతో కొంత రిలీఫ్ అన్నట్లుగా గాజు  గ్లాస్ ప్రచారానికి అయితే ఉత్తరంలో ఫుల్ స్టాప్ పెట్టించేసి అక్కడ గాజు గ్లాస్ ని పక్కన పెట్టారు. అయితే 2019లో గాజు గ్లాస్ గుర్తు మీద ఉత్తరంలో జనసేన పోటీ చేస్తే ఇరవై వేల దాకా ఓట్లు వచ్చాయి. అపుడు ఆ గుర్తుకు ఓటేసిన ఇరవై వేల మందిలో పది శాతం మంది ఆ గుర్తుకు ఆకర్షితులైనా కూటమికి షాక్ అన్న మాట ఉండనే ఉంది.

Show comments