రేసుగుర్రం-సాయి ధరమ్ తేజ

నేను రేసుగుర్రాన్ని అంటూ బన్నీ తీసిన పరుగు, ఇచ్చిన హిట్ ఇంకా మెగాభిమానులకు గుర్తువుండనే వుంది. అయితే ఆ సినిమాలో రేసులకు కానీ, గుర్రాలకు కానీ కథతో సంబంధం లేదు.

కానీ మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ మాత్రం త్వరలో హార్స్ రైడర్ గా ప్రేక్షకులకు కనిపించబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ లు ఇచ్చి, ముచ్చటగా మూడో హిట్ కోసం సాయి ధరమ్ తో విన్నర్ సినిమా చేస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాలో సాయి ధరమ్ పాత్ర రేసుల్లో కనిపించే హార్స్ రైడర్ అంట.

గమ్మత్తేమిటంటే ఈ సినిమా ఆరంభంలో సాయి ధరమ్ తేజ మీడియా సంస్థలో కంటెట్ హెడ్ కింద వుంటాడట. కానీ ఆ తరువాత కథానుసారంగా, రేసుల్లో హార్స్ రైడర్ గా మారతాడట.

ఇందుకోసం సాయి ధరమ్ ప్రత్యేకంగా ట్రయినింగ్ తీసుకుంటున్నాడట. హార్స్ రైడింగ్ వచ్చినా, ప్రత్యేకంగా ఈ తరహా జనాల బాడీ లాంగ్వేజ్ వగైరా విషయాలను ప్రత్యేకంగా నేర్చుకుంటున్నాడట. ఈ హార్స్ రైడింగ్ సీన్లను, బెంగళూరు విజయమాల్య రేస్ కోర్స్ లోనూ, ఇస్తాంబుల్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ చిత్రీకరిస్తారట.

Show comments